అన్వేషించండి

Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో లావణ్య గురించి గతంలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో ఈ వేడుక జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ ఎగేజ్మెంట్ లో  మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్‌ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘Found my Lav’ అంటూ వరుణ్, ‘Found my Forever’ అంటూ వరుణ్, లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ఫ్యామిలీలు నాగబాబు ఇంటికి వెళ్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు చెప్తున్నారు.  

అల్లు అరవింద్ మాటలు నిజం చేసిన లావణ్య

వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం నేపథ్యంలో గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా, అల్లు అరవింద్ లావణ్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తరాది నుంచి వచ్చిన లావణ్య, తెలుగు చక్కగా నేర్చుకుని మాట్లాడుతుందని, ఇక్కడే ఓ అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుందన్నారు. ఆయన మాటలను అక్షరాలా నిజం చేసింది లావణ్య. అదీ వారి కుటుంబానికి చెందిన అబ్బాయితోనే మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ కావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ వీడియో షేర్ చేస్తూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి శుభాకాంక్షలు చెప్తున్నారు.

Also Read : బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి - ఎన్‌బికె 109 ఓపెనింగ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

చాలా కాలంగా కొనసాగుతున్న ప్రేమాయణం

వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం విషయం ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు. ఆల్రెడీ ఈ విషయం చాలా మంది తెలుసు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు.ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. కానీ, వరుణ్, లావణ్యలు మాత్రం లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.   

ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సెట్స్ మీద ఉంది.   ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు.  

Read Also: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ బ్యూటీ, నెట్టింట్లో ఫోటోలు వైరల్

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
Dark Comedy Thriller OTT : శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Friday OTT Movies : ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget