![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nani: యంగ్ హీరో తేజ సజ్జాకు నాని వార్నింగ్ - ట్వీట్ వైరల్, ఏమైందంటే..
Teja Sajja: సరిపోదా శనివారం మూవీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తేజ సజ్జాకి నాని వార్నింగ్ ఇచ్చాడు. అతడి ట్వీట్‌కి నాని ఇచ్చిన రిప్లై చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు.
![Nani: యంగ్ హీరో తేజ సజ్జాకు నాని వార్నింగ్ - ట్వీట్ వైరల్, ఏమైందంటే.. Hero Nani Sweet Warning Teja Sajja After He wish to Saripodhaa Sanivaaram Team Nani: యంగ్ హీరో తేజ సజ్జాకు నాని వార్నింగ్ - ట్వీట్ వైరల్, ఏమైందంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/6afa378193f05d01935737ab137ba5561724916674857929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nani Reply to Teja Sajja Tweet: సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram movie Release) మూవీ రిలీజ్ సందర్భంగా విష్ చేసి కుర్ర హీరో తేజ సజ్జాకి నాని వార్నింగ్ ఇచ్చాడు. ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ తేజా సజ్జా విష్ చేశాడు. దీనికి నాని ఇచ్చిన సమాధానం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ఇంతకి ఏమైందంటే. 'హాయ్ నాన్న' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నేచులర్ స్టార్ నాని (Hero Nani) సరిపోదా శనివారం సినిమాతో నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.
Nani Sweet Waring: to Teja Sajja ఈ సందర్భంగా నానికి, మూవీ టీం ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే హనుమాన్ హీరో తేజా సజ్జా కూడా నానికి విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. "రేపు రిలీజ్ కాబోతున్న సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా డియర్ నాని గారికి నా శుభకాంక్షలు. మీ కృషికి బ్లాక్‌బస్టర్ రూపంలో ఫలితం రావాలని ఆశిస్తున్నా. అలాగే దసరా మూవీ టీంకి నా శుభకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు. తేజ సజ్జా ట్వీట్‌పై నాని స్పందించాడు. "గారు ఏంటీ? అన్న అను.. థ్యాంక్యూ" అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
Gaaru Enti ? Anna anu
— Nani (@NameisNani) August 28, 2024
Thank you ♥️ https://t.co/1quaJniO3Q
అంతేకాదు ఈ వార్నింగ్‌కి హార్ట్ ఎమోజీని కూడా జోడించాడు. నాని రిప్లై చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వారంత కూడా నాని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరైతే మాకు కూడా రిప్లై ఇవ్వు అన్న నఅఇ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే అంతేలే మాకు మాత్రం రిప్లై ఇవ్వవు అంటూ మూతి విరుస్తున్నారు. దీంతో ప్రస్తుతం నాని రిప్లై నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. ఆయన మంచి మనసుకు మరోసారి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: సరిపోదా శనివారం రివ్యూ: నాని మాస్ హీరోయిజం వర్సెస్ ఎస్.జె. సూర్య విలనిజం - సినిమా ఎలా ఉందంటే?
కాగా తేజ సజ్జా (Teja Sajja) చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. చాలా బాగుంది, ఇంద్ర,ఠాకూర్ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత జాంబీరెడ్డితో హీరోగా మారాడు. రీసెంట్‌గా ప్రశాంత్ వర్మతో సూపర్ హీరో చిత్రం 'హనుమాన్'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా తేజ సజ్జా క్రేజ్ పెరిగిపోయింది. అప్పటి నుంచి తేజ ఇండస్ట్రీలో ఫుల్ యాక్టివ్ అయ్యాడు. మరోవైపు సోషల్ మీడియాలో తరచూ పోస్ట్స్ పెడుతూ చురుకుగా ఉంటున్నాడు. ప్రస్తుతం హనుమాన్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read: అవి మహిళల కనీస అవసరాలు - హేమ కమిటీ నివేదికపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)