Samantha: అవి మహిళల కనీస అవసరాలు - హేమ కమిటీ నివేదికపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Samantha React on Hema Committee: హేమ కమిటీ రిపోర్టు స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది. మహిళలపై సమస్యలో WCC అద్బుతంగా పనిచేసిందంటూ కమిటీ సభ్యులను కొనియాడింది. అలాగే..
Samanatha On Hema Committee Report: ప్రస్తుతం చిత్ర పరిశ్రమల్లో ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు సంచలనంగా మారింది. మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మాలీవుడ్‌లోని చీకటి కోణాలను హేమ కమిటీ బహిర్గతం చేసింది. ఇక్కడ మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నాని ఈ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. బాధితుల వాంగ్మూలాలతో నివేదిక సీఎం పినరయి విజయన్‌కి అందించింది. దీనిపై మాలీవుడ్ ఇండస్ట్రీతో సహా ఇన ఇండస్ట్రీలు కూడా షాక్ అవుతున్నాయి. అంతేకాదు బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై 'అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్'పై (AMMA) విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో అమ్మ పూర్తిగా విఫలమైందంటూ మండిపడుతున్నారు. హేమ కమిటీ రిపోర్టు అనంతరం బాధితులు కూడా బయటకు వచ్చిన తమకు ఎదురైన అనుభవాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే హేమ కమిటీ రిపోర్టు సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా హేమ కమిటీపై స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. ఈ సందర్భంగా కమిటీ పనితీరు ప్రశంసించింది. అలాగే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(WCC)కి కృతజ్ఞతలు తెలిపింది.
డబ్య్లూసీసీ పనితీరు అద్భుతం
"కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ ఏర్పడింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో కోసం డబ్య్లూసీసీ ఎంతో కృషి చేస్తోంది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్బుతైన పనితీరు ఎన్నో ఎళ్లుగా గమనిస్తున్నాను. ఇప్పుడు దాని చోరవ వల్లే హేమ కమిటీ తమ నివేదికను ఇచ్చింది. దీంతో పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఇబ్బందులు వెలుగులో చూశాయి. నిజానికి మహిళలు పని చేసే చోట సురక్షితమైన వాతావరణం, గౌరవప్రదమైన పని ప్రదేశాలు వారి కనీస అవసరాలు. కానీ వాటి కోసం ఇప్పటికీ ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న నా స్నేహితులు, సోదరిమణులకు కృతజ్ఞతలు" అంటూ సామ్ తన పోస్ట్‌లో పేర్కొంది.
ఇప్పటికే హేమ కమిటీ సీనియర్ నటి ఖుష్బూ స్పందించారు. ఈ విషయంలో ధైర్యంగా ముందుకు వచ్చిన చెప్పిన బాధితులను ప్రశంసించారు. ఇక బాధతులతో మనమంతా సపోర్టు ఇవ్వాలని, వారితో మాట్లాడి ధైర్యం కల్పించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు మనమంత కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే హీరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్పందిస్తూ హేమ కమిటీతో తాను స్వయంగా మాట్లాడనన్నారు.
Also Read: నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం
పరిశ్రమలో మహిళలపై రక్షణంలో కల్పించడంలో 'అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్' ఫెయిల్ అయ్యిందని ఆయన మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఆరోపణలు నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే తప్పుడు ఆరోపణలు చేసిన వారికి కూడా శిక్షించాల్సిందేనన్నారు. ఇక ముకుమ్ముడిగా అమ్మపై విమర్శలు రావడంలో అసోసిషియేషన్‌కు అధ్యక్షుడుగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే మిగతా సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారు.