Gopichand Accident: షూటింగ్ సెట్‌లో హీరో గోపీచంద్‌కు ప్రమాదం
హీరో గోపిచంద్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని డైరెక్టర్ శ్రీవాస్ తెలిపారు.
Gopichand Accident | హీరో గోపీచంద్ శుక్రవారం ప్రమాదానికి గురయ్యారు. మైసూర్‌లోని ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో గోపిచంద్ స్లిప్ అయ్యారు. దీంతో కాస్త ఎత్తైన ప్రాంతం నుంచి జారి కిందపడ్డారు. గోపీచంద్ ప్రస్తుతం తన 30 చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ గతంలో ఆయనతో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాల్లో కూడా నటించారు. అవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. లక్కీగా ఈ ప్రమాదంలో గోపీచంద్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని నిర్మాత ఎస్‌కేఎన్ ట్వీట్ చేశారు. డూప్ లేకుండా ఫైటింగ్ సీన్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Just spoke with Our Macho star @YoursGopichand garu
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 29, 2022
While shooting for his next he
just fell down due to leg slip. By God's grace nothing happened to him and he is doing completely fine ♥️. pic.twitter.com/ZXZYUHXUUj
View this post on Instagram
Also Read: కొరటాలతో ఎన్టీఆర్ సినిమాపై 'ఆచార్య' ఎఫెక్ట్? ఆందోళనలో యంగ్ టైగర్ ఫ్యాన్స్??