Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం - సురక్షితంగా బయటపడ్డ నటుడు
Ajith Kumar Accident: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియంలో జరిగిన రేస్‌లో ఆయన నడిపిన కారు అదుపు తప్పి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది.

Tamil Star Ajith Kumar Met With Accident Again In Car Race: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. కార్ రేస్ సమయంలో ట్రాక్‌పై ఆయన నడిపిన కారు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
రేసింగ్‌లో ప్రమాదం
బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా - ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో అజిత్ తాజాగా పాల్గొన్నారు. రేస్ సమయంలో ఆయన నడుపుతున్న కారు కంట్రోల్ తప్పి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది. ప్రమాదం నుంచి అజిత్ సురక్షితంగా బయటపడడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#AjithKumarRacing #AjithKumar
— SUN'S Friday ☀️🌊 (@SUNSFRIDAY) April 19, 2025
Ajith Sir Racing Car Accident: pic.twitter.com/GOn0GADCcw
Also Read: డ్రగ్స్ రైడ్ సమయంలో పరారైనట్లు ఆరోపణలు - పోలీస్ విచారణకు దసరా 'విలన్'
ఇంతకు ముందు కూడా ప్రమాదాలు
రేసింగ్ సమయంలో ఇంతకు ముందు కూడా హీరో అజిత్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈయన నడుపుతున్న వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇక, జనవరిలోనూ దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా.. ఆయన కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి సైతం ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పోర్చుగల్‌లో జరిగిన కార్ రేస్ పోటీల్లో అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది.
ఇక.. సినిమాల విషయానికొస్తే.. అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తాజాగా రూ.200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. మూవీలో అజిత్ సరసన త్రిష నటించగా.. అర్జున్‌దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.





















