అన్వేషించండి

Happy Birthday Anushka Sharma: జర్నలిజం నుంచి స్టార్‌ హీరోయిన్ వరకు, అనుష్క శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?

Anushka Sharma Birthday: అసలు నటనపైనే ఆసక్తి లేని అనుష్క స్టార్‌ హీరోయిన్‌ వరకు ఎలా ఎదిగింది. జర్నలిస్ట్‌గా‌ పని చేసిన ఆమె ఇండస్ట్రీకి ఎలా వచ్చింది. ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Happy Birthday Anushka Sharma: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ బర్త్‌డే నేడు. మే 1, 1988లో అయోధ్యలో పుట్టింది అనుష్క.  ఆర్మీ కుటుంబ నేపథ్యంలో జన్మించిన అనుష్కకు మొదట్లో నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. అలా అనుకోకుండ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అసలు యాక్టింగ్‌పైనే ఆసక్తిని లేని ఆమె సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఆమె బాల్యం, ఇతరత్ర ఆసక్తికర విషయాలపై ఇక్కడ ఓ లుక్కేయండి. 

ఆర్మీ కుటుంబం నుంచి సినీ నటిగా

అనుష్క తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ సైనిక అధికారి, ఆమె తల్లి అషిమా శర్మ గృహిణి. అయోధ్యలో పుట్టిన అనుష్క బాల్యం మొత్తం బెంగళూరులో గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం అస్సాంలోని మార్గెరిటాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో చదివింది. ఎంఎస్‌ ధోని భార్య సాక్షి ధోని కూడా అదే స్కూల్‌. దీంతో ఇద్దరు బాల్య స్నేహితులు. ఆ తర్వాత మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మొదటి నుంచి అనుష్క నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. దీంతో జర్నలిజంలో చేరింది. బెంగళూరుకు చెందిన మీడియా సంస్థలో జర్నలిస్ట్‌గా కూడా పని చేసిన ఆమె ఆతర్వాత మోడలింగ్‌పై ఆసక్తి రావడంతో మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఇందుకోసం ముంబై వెళ్లిన ఆమె ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్‌లో చేరింది. అక్కడ మోడలింగ్‌లో ట్రైయినింగ్‌ తీసుకున్న అనుష్క అదే టైంలో 2007లో తొలిసారి ఓ ఫ్యాషన్‌ షో పాల్గొంది.

మోడల్ రాణించిన శర్మ

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో రన్‌వేగా ఆరంగేట్రం చేసిన అనుష్క అదే సంవత్సరంలో స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్‌లో మోడల్‌గా గుర్తింపు పొందింది మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత అనుష్క సిల్క్‌ అండ్‌ సైన్‌, విస్పర్‌, నాథెల్లా జ్యువెలరీ, ఫియట్‌ పాలియో వంటి బ్రాండ్‌లో అంబాసిడర్‌గా వ్యవహరించింది. మోడల్‌గా రాణిస్తున్న అనుష్కక ఆ తర్వాత నటనపై ఆసక్తి కలిగిందట. నటిగా వెండితెరపై రాణించేలా ఆశతో యాక్టింగ్ స్కూల్లో చేరింది. అదే టైం రణ్‌వీర్‌ సింగ్‌ వంటి స్టార్స్‌ కూడా అనష్క శర్మతో యాక్టింగ్‌ స్కూల్లో చేరింది. అదే టైం పలు చిత్రాలకు ఆడిషన్స్‌ ఇచ్చిన ఆమె ఏకంగా షారుక్‌ ఖాన్‌ సరసన చాన్స్‌ కొట్టేసింది. ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే సినిమాల్లో‌ ఆఫర్స్‌ కొట్టేసింది. అదీ కూడా తొలి సినిమాకే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌తో నటించే లక్కీ చాన్స్‌ రావడం నిజంగా ఆమె లక్క్‌ అని చెప్పాలి. అలా రబ్‌ నే బనాది జోడీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది అనుష్క.

ఆ తర్వాత బద్మాష్‌ కంపెనీ, బ్యాండ్‌ బాజా భారత్‌, పటియాలా హౌజ్‌ వంటి చిత్రాలతో వరుసగా ఆఫర్స్ అందుకుంది. సినిమాల ఫలితం ఎలా అనుష్కకు మాత్రం ఆఫర్స్‌ క్యూ కడుతూనే ఉన్నాయి. అలా ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. జబ్‌ తఖ్‌ హై జాన్‌, పీకే, NH10, సుల్తాన్‌ వంటి చిత్రాలతో కమర్షియల్‌ హిట్స్‌ అందుకుంది. అదే 2013లో ఓ కమర్షియల్‌ యాడ్‌ సమయంలో టిమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పరిచయం ఏర్పడింది. ఆ పరియం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు సీక్కెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించడం లేదు. అప్పుడప్పుడు ఏడాదికో సినిమా చేస్తూ ఫ్యాన్స్‌ అలరిస్తూ వస్తుంది. చివరిగా 2018లో సూయ్‌ దాగ, జీరో హీరోయిన్‌గా నటించిన అనుష్క ఇప్పటి వరకు హీరోయిన్‌ చేసిని సినిమా లేదు. 2020లో 'బుల్‌బుల్‌' సినిమాను నిర్మించిన ఆమె 2022లో క్వాల అనే సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. అలా పెళ్లి తర్వాత ఎక్కువ పర్సనల్‌ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న అనుష్క 2021 జనవరి 11న కూతురు వామికకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్‌ అనంతరం ఈ ఏడాది ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి పేరు అకాయ్‌ అని నామకరణం చేసినట్టు గత ఫిబ్రవరి అనుష్క-కోహ్లి దంపతులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ భర్త కోహ్లికి సపోర్టు ఇస్తుంది. కోహ్లి ఆడే ప్రతి మ్యాచ్‌కు హజరవుతూ భర్తకు ప్రోత్సహం ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం అనుష్క నటించి చక్డా ఎక్స్‌ప్రెస్‌ మూవీ రిలీజ్‌ కావాల్సి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget