Prasanth Varma Post: 'హనుమాన్' రెమ్యునరేషన్ వివాదం - క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
Hanuman Director Prasanth Varma: మూవీ పారితోషికం విషయంలో నిర్మాత - డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మధ్య గొడవలు వచ్చాయంటూ ఓ వార్త ప్రచారం లో ఉంది. తాజాగా దీనికిపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.
Prasanth Varma Clarifies Rumours: ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజై పండగ మూవీగా నిలిచింది హనుమాన్. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ ఊహించని విజయం అందుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. భారతీయ ఇతిహాసాల్లోని సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను తీసుకుని విజువండర్ చూపించాడు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగున్నాయంటూ ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. నిజానికి ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా తెచ్చుకొని సినిమాగా హనుమాన్ నిలిచింది. ఇక ఇందులో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ చూస్తే మూవీ బడ్జెట్ రూ. 100 కోట్లపైనే అయ్యిందని అభిప్రాయపడ్డారు.
కానీ అసలు బడ్జెట్ అంతా నోళ్లు వెల్లబెట్టారు. కేవలం రూ. 45 నుంచి రూ. 50 కోట్ల మధ్య అయ్యింది. అంత తక్కువ బడ్జెట్‌లో భారీ అద్భుతమైన విజువల్స్ చూపించిన ప్రశాంత్ వర్మ పనితానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సంక్రాంతికి నిజంగా ఒక పండగలాంటి సినిమా చూపించావంటూ ప్రశంసలు కురిపించారు. ఇక మూవీ రిలీజై దాదాపు నెల రోజులు అవుతున్న ఇప్పటికీ హనుమాన్ థియేటర్లో సందడి చేస్తూనే ఉంది. అంతా బాగుందని అనుకుంటుండగా.. రెండు రోజులు నుంచి మూవీకి సంబంధించి ఓ నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పారితోషికం విషయంలో నిర్మాత నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మధ్య గొడవలు వచ్చాయంటూ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు.
Also Read: 'పుష్ప 2'పై సాలీడ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ - ఏం చెప్పాడంటే..
ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాత-దర్శకుడికి మధ్య గొడవలు తలెత్తాయని, సినిమాకు వచ్చిన లాభాల్లో ప్రశాంత్ వర్మ 30 శాతం వాటా ఇవ్వాలని నిర్మాతను డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు హనుమాన్ సీక్వెల్‌కు ముందు అడ్వాన్స్‌తో పాటు లాభాల్లో వాటా కావాలని నిర్మాతను ఒత్తిడి చేస్తున్నట్టు ఓ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ వార్తలపై ప్రశాంత్ వర్మ స్పందించాడు. తన ఎక్స్ పేజీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి నెగిటివిటీకి చెక్ పెట్టాడు. ఈ ఫొటోలు ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ మొబైల్ చూస్తున్నారు.
Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddy pic.twitter.com/2O5J6BqwPH
— Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024
"ఇలా నవ్వుతూ నెగిటివిటీని తీసిపడేశాం.. హనుమాన్ స్పిరిట్‌ను కొనసాగిస్తున్నాము" అంటూ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌తో ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజ్‌రెడ్డి మధ్య ఎలాంటి గొడవలు లేవని తేలిపోయింది. ఇది చూసి ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్, హనుమాన్ మూవీ లవర్స్ అంతా రిలాక్స్ అవుతున్నారు. కాగా హనుమాన్ ఎవరూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. నిర్మాతలు కూడా ఊహించిన రేంజ్‌లో మూవీ భారీగా వసూళ్లు రాబట్టంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. మూవీ భారీ విజయం, ఊహించని కలెక్షన్స్ రావడం చూసి గిట్టని వారెవరో ఈ నెగిటివ్ ప్రచారం చేసుంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతబాగున్న నిర్మాత-డైరెక్టర్ మధ్య చిచ్చు పెట్టిందని ఎవరని ఆరా తీస్తున్నారు.