అన్వేషించండి

Upcoming Telugu Movies: గోపీచంద్ ‘భీమా’, విశ్వక్‌ సేన్‌ ‘గామి’ - ఈవారం థియేటర్లలో అలరించే మూవీస్ ఇవే!

శివరాత్రి సందర్భంగా పలు సినిమాలో థియేటర్లలో అలరించబోతున్నాయి. గోపీచంద్ నటించిన ‘భీమా’, విశ్వక్ సేన్ ‘గామి’ సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి.

Upcoming Movies In Telugu: మార్చి(2024) రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లలో అలరించనున్నాయి. శుక్రవారం నాడు శివరాత్రి కావడంతో బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాల సందడి నెలకోనుంది. సరికొత్త కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు మూవీ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి. ఇంతకీ ఈ వారం థియేటర్లలోకి అడుగు పెట్టే సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   

1. ‘భీమా’

టాలీవుడ్ మాస్ హీరో గోపీచంద్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ‘భీమా’.  మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో గోపీచంద్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 8న విడుదలకు రెడీ అవుతోంది. 

2. ‘గామి’

టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన అడ్వెంచర్ మూవీ ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హిమాలయాల్లో ఓ అఘోర చేసే సాహసోపేతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో విశ్వక్ ఆఘోరా శంకర్ గా కనిపించనున్నారు. ఈ మూవీ శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.    

3. ‘ప్రేమలు’

మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన ‘ప్రేమలు’ సినిమా తెలుగులోకి రాబోతోంది. కేవలం రూ.3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 85 కోట్లు వసూళు చేసింది. నస్లెన్‌ గఫూర్‌, మాథ్యూ థామస్‌, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో గిరీశ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

4. ‘రికార్డ్‌ బ్రేక్‌’

చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’. నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. 

5. ‘వుయ్ లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’

రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వుయ్ లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’. అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

6. ’నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి’

సత్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ’నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి’. రవితేజ నున్న, నేహా జురెల్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. కామెడీ, లవ్, థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

7. ‘సైతాన్‌’

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌, తమిళ స్టార్ యాక్టర్ మాధవన్‌, సీనియర్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ‘సైతాన్’. ఈ సినిమాకు వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించారు. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read Also: మహేష్ బాబు నా క్లాస్ మేట్, బెంచీలు ఎక్కి దూకుతూ అల్లరి చేసేవాళ్లం - కోలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget