Chiranjeevi - Salman Khan: ముంబైలో మెగాస్టార్, బాలీవుడ్ భాయిజాన్‌తో కలిసి!
Megastar Chiranjeevi Godfather Movie Update: మెగాస్టార్ చిరంజీవి ముంబైలో ఉన్నారు. బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ తో కలిసి షూటింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటి. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్'కు రీమేక్‌గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan will be seen In Chiranjeevi's GodFather Movie) కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన సినిమా షూటింగ్ చేయనున్నారు.
ఇప్పుడు చిరంజీవి ముంబైలో ఉన్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి 'గాడ్ ఫాదర్' షూటింగ్ చేస్తున్నారు (Chiranjeevi at Mumbai, Shooting For Godfather movie along with Salman Khan). టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ భాయిజాన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌కు తోడు 'లూసిఫర్' రీమేక్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ రీమేక్ అయినప్పటికీ... చిరంజీవి ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేశారట దర్శకుడు మోహన్ రాజా. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నట్టు సమాచారం.
Also Read: ప్రభాస్‌తో మారుతి మసాలా ఎంటర్‌టైనర్, మరిన్ని డీటెయిల్స్ ఇవిగో!
'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన ట్యూన్స్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మీద ఓ పాటను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఆ పాటకు స్పెషల్ ట్యూన్ రెడీ చేస్తున్నారట. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి 153వ సినిమా ఇది.
Also Read: కమల్ హాసన్ 'విక్రమ్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?
View this post on Instagram