Vikram Movie Release date: కమల్ హాసన్ 'విక్రమ్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?
Kamal Haasan's Vikram Movie Release date: కమల్ హాసన్ కథానాయకుడిగా... విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'విక్రమ్' మూవీ విడుదల తేదీ ఖరారు అయ్యింది.
'విక్రమ్' (Vikram Movie)... లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇందులో విజయ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. జూన్ 3న (Vikram Movie Release On June 3, 2022) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ఈ రోజు ఉదయం వెల్లడించారు.
View this post on Instagram
Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?
'విక్రమ్' చిత్రానికి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు కార్తీ హీరోగా 'ఖైదీ', విజయ్ హీరోగా 'మాస్టర్' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులోనూ 'ఖైదీ' భారీ విజయం సాధించింది. 'మాస్టర్' సినిమాకు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ ఆదరణ లభించింది. భారీ వసూళ్లు సాధించింది. విజయ్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని లోకేష్ సినిమా తీశారని పేరొచ్చింది. ఇప్పుడు 'విక్రమ్'తో మరో విజయంపై ఆయన గురి పెట్టారు. ఈ రోజు లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు (lokesh kanagaraj birthday). ఒక విధంగా ఆయనకు పుట్టినరోజు బహుమతిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారని చెప్పవచ్చు.
Also Read: ది ఆడం ప్రాజెక్ట్ రివ్యూ: సీటు నుంచి కదలనివ్వని టైం ట్రావెల్ డ్రామా!
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్ తదితరులు నటిస్తున్నారు.
View this post on Instagram