By: ABP Desam | Updated at : 08 Mar 2023 08:30 AM (IST)
చిత్రా శుక్లా
చిత్రా శుక్లా (Chitra Shukla), ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar), చరిష్మా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 'గీత సాక్షిగా' (Geeta Sakshigaa Movie). చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్పక్, JBHRNKL సమర్పకులుగా వ్యవహరించారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు, హిందీలో...
మార్చి 22న 'గీత సాక్షిగా'
హోలీ సందర్భంగా 'గీత సాక్షిగా' విడుదల తేదీ వెల్లడించారు. మార్చి 22న సినిమా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, హిందీ భాషల్లో 'గీత సాక్షిగా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 'గీత సాక్షిగా జడ్జ్‌మెంట్ డే మార్చి 22న' అని ఓ పోస్టర్ విడుదల చేశారు. చరిష్మా పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని చిత్ర బృందం తెలిపింది.
'గీత సాక్షిగా' సినిమాలో ఎవరి క్యారెక్టర్లు ఏంటి?
'గీత సాక్షిగా' సినిమాలో ఆదర్శ్ జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అతని తరపున వాదించే న్యాయవాది పాత్రలో చిత్రా శుక్లా, ఆమెకు ప్రత్యర్థి న్యాయవాదిగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. 'గీత సాక్షిగా' టీజర్ విషయానికి వస్తే... ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లడం, అతని కోసం చిత్రా శుక్లా జైలుకు వెళితే... ముఖం మీద ఒకరు ఇంక్ పోయడం వంటివి టీజర్‌లో చూడవచ్చు. జైలులో కొంత మంది ఎటాక్ చేయబోతే... అందరినీ చితక్కొట్టిన ఆదర్శ్... 'పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు, వాడి బాబు అర్జునుడిని రా' అంటూ చెప్పిన డైలాగ్, ఆయన సిక్స్ ప్యాక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి పెంచాయి.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం
Wishing everyone a very Happy Holi 🌈❤️#GeetaSakshigaa Judgement Day takes place on March 22 💥
Teugu & Hindi ❤️🔥#GeetaSakshigaaOnMar22 @ChetanRajFilmz #ChetanMaisuria @Anthonymattipal @Gopisundaroffl @actoraadarsh @ChitrashuklaOff @beyondmediapres @adityamusic pic.twitter.com/fqIPOeQ9i2 — Chetan Raj Films (@ChetanRajFilmz) March 7, 2023
వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు. ఒక చిన్నారి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. చిన్నారిని ఎవరో పట్టుకోవాలని ప్రయత్నించడం, ఆ పెద్దల నుంచి తప్పించుకోవడానికి చిన్నారి వేసే అడుగులు ఆసక్తిగా ఉంటాయట.
Also Read : వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?
శ్రీ విష్ణు 'మా అబ్బాయి', రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం', శ్రీ సింహా కోడూరి 'తెల్లవారితే గురువారం', 'అల్లరి' నరేష్ 'సిల్లీ ఫెలోస్' సినిమాల తర్వాత తెలుగులో చిత్రా శుక్లా నటిస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమాలో ఆమె అతిథి పాత్రలో నటించారు. సినిమా ప్రారంభంలో ఆత్మహత్య చేసుకునే అమ్మాయిగా కనిపించారు. ఆమె 'ఉనికి' అని మరో సినిమా కూడా చేస్తున్నారు.
భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ.
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?