By: ABP Desam | Updated at : 02 Jul 2022 02:28 PM (IST)
'నా పేరు సీసా' పాటలో అన్వేషి జైన్
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' (RamaRao On Duty Movie). జూలై 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. ఈ రోజు మూడో పాట 'నా పేరు సీసా' విడుదల చేశారు.
సామ్ సిఎస్ సంగీతం అందించిన 'నా పేరు సీసా...' (Naa Peru Seesa Lyrical) ను చంద్రబోస్ రాశారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో అన్వేషి జైన్ (Anveshi Jain) స్టెప్పులు వేశారు. హిందీలో 'గండి బాత్ 2'తో ఆమె పాపులర్ అయ్యారు. ఈ సాంగ్ కంటే ముందు తెలుగులో 'కమిట్‌మెంట్' సినిమాలో నటించారు. అది ఇంకా విడుదల కాలేదు. ఈలోపు రవితేజ సినిమాలో సాంగ్ చేసే అవకాశం ఆమెకు వచ్చింది.
Also Read : 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ
శరత్ మండవ (Sarath Mandava) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇసుక మాఫియాతో పాటు సమాజంలో అవినీతిపై పోరాటం చేసే ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారు.
Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే
Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!
Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?
Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..