అన్వేషించండి

Game Changer Second Single: 'గేమ్ ఛేంజర్'లో రెండో పాట 'రా మచ్చా మచ్చా'... ప్రేక్షకుల ముందుకు  వచ్చేది ఆ రోజేనంట!

Game Changer Movie Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో రెండో సాంగ్ రిలీజుకు ముహూర్తం ఖరారు చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). ఆల్రెడీ ఓ సాంగ్ రిలీజ్ అయింది. 'జరగండి జరగండి...' అంటూ సంగీత దర్శకుడు తమన్ పక్కా పెప్పీ మాస్ నంబర్ అందించారు. అది చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ వినాయక చవితికి రెండో సాంగ్ ఈ నెలలో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆ అప్డేట్ లేదు. మరి, ఆ సాంగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

సెప్టెంబర్ 30న 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్!
Game Changer Second Single Release Date: సెప్టెంబర్ 25న 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్ 'రా మచ్చా మచ్చా' రిలీజ్ గురించి అప్డేట్ ఇస్తామని తమన్ ట్వీట్ చేశారు. అయితే, ఆ అప్డేట్ మరేదో కాదు... ఈ నెల (సెప్టెంబర్ 30న) ఆ రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అదీ సంగతి!

నో డౌట్... డిసెంబర్ 20న సినిమా రిలీజ్ పక్కా!
Game Changer Movie Release Date: 'గేమ్ ఛేంజర్' సినిమాను క్రిస్మస్ బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత 'దిల్' రాజు ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే, ఈ సినిమా విడుదల మీద కొందరికి సందేహాలు ఉన్నాయి. ఆ కారణంగా 'మ్యాడ్ 2', 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' వంటి సినిమాలను చకచకా రెడీ చేస్తున్నారని... ఒకవేళ అనుకున్న సమయానికి 'గేమ్ ఛేంజర్' విడుదల కాకపోతే ఆయా సినిమాలు విడుదల అవుతాయని ప్రచారం జరుగుతోంది. తమన్ చేసిన ట్వీట్ ఒక విధంగా వాటికి చెక్ పెడుతుందని ఆశించవచ్చు.

Also Read: ఎన్టీఆర్ ఎగ్జైట్‌మెంట్‌తో నెక్ట్స్ లెవల్‌కు... మనోళ్లకు అంత టైమ్ ఇస్తే అద్భుతాలే - కొరటాల శివ ఇంటర్వ్యూ

డిసెంబర్ 20న 'గేమ్ ఛేంజర్' విడుదల అవుతుందని తమన్ ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన చేసే ప్రతి ట్వీట్‌లోనూ రిలీజ్ డేట్ తప్పకుండా మెన్షన్ చేస్తున్నారు.


సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటించారు. తెలుగమ్మాయి అంజలి మరో కథానాయిక. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనున్నారు. ఎస్.జె. సూర్య కీలమైన విలన్ రోల్ చేస్తున్నారు. ఇక ఇతర పాత్రల్లో శ్రీకాంత్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 50వ చిత్రమిది.

Also Readచిరుతో విబేధాలు లేవు... 'ఆచార్య' తర్వాత మెగా మెసేజ్... పుకార్లకు చెక్ పెట్టిన కొరటాల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
MLC Elections: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
Vijayawada: విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
MLC Elections: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
Vijayawada: విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
Jammu Kashmir Elections 2024: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం - 26 స్థానాల్లో 239 మంది పోటీ 
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం - 26 స్థానాల్లో 239 మంది పోటీ 
Game Changer Second Single: 'గేమ్ ఛేంజర్'లో రెండో పాట 'రా మచ్చా మచ్చా'... ప్రేక్షకుల ముందుకు  వచ్చేది ఆ రోజేనంట!
'గేమ్ ఛేంజర్'లో రెండో పాట 'రా మచ్చా మచ్చా'... ప్రేక్షకుల ముందుకు  వచ్చేది ఆ రోజేనంట!
Rains: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో రాబోయే 3 రోజులు వర్షాలు, ఏపీ తాజా వెదర్ రిపోర్ట్
అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో రాబోయే 3 రోజులు వర్షాలు, ఏపీ తాజా వెదర్ రిపోర్ట్
Share Market Opening 25 Sept 2024: రెండో రోజూ ప్రాఫిట్ బుకింగ్స్‌తో ప్రారంభం - పెరిగిన మెటల్స్‌, ఒత్తిడిలో ఐటీ స్టాక్స్
రెండో రోజూ ప్రాఫిట్ బుకింగ్స్‌తో ప్రారంభం - పెరిగిన మెటల్స్‌, ఒత్తిడిలో ఐటీ స్టాక్స్
Embed widget