The Warriorr Preview: 'ది వారియర్' ప్రివ్యూ - స్పెషల్ అట్రాక్షన్స్
Five reasons that make Ram Pothineni's The Warriorr a must-watch in theatres: రామ్, కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్' థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్స్ గురించి ప్రివ్యూ..
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా 'ది వారియర్'. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటి? ప్రేక్షకుల కోసం 'ది వారియర్' ప్రివ్యూ...
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేసిన ఉస్తాద్ రామ్
'ది వారియర్'కు మెయిన్ అట్రాక్షన్ ఉస్తాద్ రామ్ (Ram Pothineni). ఆయన ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేసిన చిత్రమిది. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ లుక్, ఆయన అగ్రెస్సివ్ ఎక్స్‌ప్రెషన్స్ ఆల్రెడీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. 'జగడం' టు 'ఇస్మార్ట్ శంకర్' వరకూ రామ్ కొన్ని మాస్ కమర్షియల్ చిత్రాలు చేశారు. అయితే, ఈ సినిమాలో ఊర మాస్ రోల్ చేసినట్లు తెలిసింది. అందులోనూ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆయన నుంచి వస్తున్న కమర్షియల్ చిత్రమిది. పాటలు, ఫైట్లు, సీన్స్‌లో రామ్ ఎనర్జీ గురించి తెలిసిందే. థియేటర్లకు వెళితే కమర్షియల్ కిక్ ఎంజాయ్ చేయవచ్చు.
కృతి శెట్టి విజిల్ వేస్తే... మాస్ డ్యాన్స్ చేస్తే?
'ది వారియర్'లో మరో అట్రాక్షన్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty). కథానాయికగా తొలి సినిమా 'ఉప్పెన'తో ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' చిత్రాలు చేశారు. అయితే... 'ఉప్పెన' తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఆమె హైలైట్ అవుతోన్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన 'బుల్లెట్...', 'విజిల్...' సాంగ్స్‌లో రామ్, కృతి వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. కృతి మాస్ డ్యాన్స్ మామూలుగా లేదు. మాస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా!
లింగుస్వామి డైరెక్షన్ అండ్ 'ది వారియర్' కాన్సెప్ట్!
దర్శకుడు లింగుస్వామికి స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన తీసిన 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలు తెలుగులోనూ విజయాలు సాధించాయి. 'సికిందర్' స్టైలిష్ ఫిల్మ్ అనే పేరొచ్చింది. అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా నటించిన 'తడాఖా' ఆయన తీసిన తమిళ సినిమా 'వేట్టై'కి రీమేక్. లింగుస్వామి డైరెక్షన్, కమర్షియల్ సెన్స్ గురించి తెలుగు ఆడియన్స్‌కు తెలుసు. అయితే, ఆయన తీసిన లాస్ట్ సినిమాలు కొన్ని ఆశించిన విజయాలు అందుకోలేదు. అంత మాత్రాన లింగుస్వామిని తక్కువ అంచనా వేయలేం. హిట్ కొట్టాలనే కసితో 'ది వారియర్' తీశారట.
'ది వారియర్' కాన్సెప్ట్ కూడా రెగ్యులర్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుందని టాక్. డాక్టర్ వృత్తిని వదిలి మరీ ఓ యువకుడు పోలీస్ ఎందుకు అయ్యాడు? అనేది అందర్నీ ఆకట్టుకుంటుందని, సినిమాలో ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతారని యూనిట్ ధీమాగా ఉంది.
విలన్‌గా ఆది పినిశెట్టి
ఆది పినిశెట్టి టాలెంటెడ్ ఆర్టిస్ట్. సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తారు. ముఖ్యంగా క్యారెక్టర్ రోల్స్ విషయంలో! కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చితేనే ఓకే చెబుతారు. గతంలో 'సరైనోడు'లో ఆయన విలన్ రోల్ చేశారు. మళ్ళీ 'ది వారియర్'లో విలన్ రోల్ చేశారు. గురు పాత్రలో ఆది గెటప్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్...
కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించడంలో దేవిశ్రీ ప్రసాద్‌ది సెపరేట్ స్టైల్. 'బుల్లెట్...' సాంగ్, 'విజిల్...' సాంగ్‌తో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లారు. దేవి శ్రీ నేపథ్య సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని వినికిడి.
థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే సినిమా తీశామని రామ్ అంటున్నారు. పాటలు, ఫైట్లు, ప్రోమోలు చూస్తే... పక్కా కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీగా ఉంది. ఇటువంటి సినిమాలను థియేటర్లలో చూస్తేనే కిక్ ఉంటుంది.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్... శ్రీనివాసా చిట్టూరి ప్రొడక్షన్ వేల్యూస్! ప్రేక్షకులకు విజువల్ గ్రాండియర్ ఇవ్వడం కోసం ఖర్చుకు వెనుకాడలేదని యూనిట్ అందరూ చెప్పిన మాట. ఒక్కో పాట కోసం కోట్లు ఖర్చుపెట్టి సెట్స్ వేశారట.
Also Read : బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్‌తో విజయ్ అనకొండ ఎఫైర్, అందుకే రష్మికకు ఛాన్సులు - కేఆర్కే సెన్సేషనల్ కామెంట్స్