News
News
వీడియోలు ఆటలు
X

‘సెల్ఫిష్’ లిరికల్ సాంగ్: ‘రౌడీ బాయ్స్’ హీరో, ‘లవ్‌ టుడే’ బ్యూటీల ‘దిల్ ఖుష్’ పాట చూశారా?

హీరో ఆశిష్ రెడ్డి, ఇవానా జంటగా నటించిన సెల్ఫిష్ సినిమాకు సంబంధించి తొలి లిరికల్ సాంగ్ ప్రోమో వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్ కు మంచి టాక్ రాగా..ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది

FOLLOW US: 
Share:

Selfish : 'రౌడీబాయ్స్' చిత్రంతో పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో ఆశిష్ రెడ్డి, 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా నటించిన చిత్రం 'సెల్ఫిష్'. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి చెందిన పోస్టర్ ను చిత్ర నిర్వాహకులు ఇప్పటికే రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మే1 హీరో ఆశిష్ రెడ్డి బర్త్ డే సందర్భంగా...ఈ సినిమాలోని తొలి లిరికల్ పాట వీడియో ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ హల్ చల్ చేస్తోంది.

సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ లు ‘సెల్ఫిష్’ చిత్రాన్ని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని దిల్ ఖుష్ పాటను మే1న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. అంతే కాకుండా ఈ పాటకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరో ఆశిష్ మాస్ లుక్ లో, అటిట్యూట్ గల యువకుడిగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. పాత బస్తీ కుర్రాడిగా.. పూర్తిగా వైవిధ్యభరితమైన స్టోరీతో యువతరానికి నచ్చేలా ఈ మూవీని నిర్మిస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన ‘‘దిల్ ఖుష్’’ సాంగ్ కు జావేద్ అలీ అద్భుతమైన వోక్స్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో వీడియోలో ఆశిష్ రెడ్డి తన డ్యాన్సులతో అదరగొడుతుండగా.... హీరోయిన్ ఇవానా.. సంప్రదాయమైన లంగా, వోణీలో కనిపించింది. ఈ పాటకు నెటిజనులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

‘సెల్ఫిష్’ మూవీలోని ‘‘దిల్ ఖుష్’’ సాంగ్‌ను ఇక్కడ చూడండి

ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాశీ విశాల్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. యూత్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

'రౌడీ బాయ్స్' సినిమాతో నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే ఆశిష్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా 'సెల్ఫిష్' చేస్తున్నారు. అందులో ఆశిష్‌కు జోడిగా నటిస్తున్న ఇవానా ‘లవ్‌టుడే’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆమెకు ‘సెల్ఫిష్’ తొలి తెలుగు చిత్రం. ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: నాకు మాట రాకున్నా అర్థం చేసుకున్నారు, నా డ్రైవర్ ఏడ్చేశాడు - సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం

Published at : 01 May 2023 08:05 PM (IST) Tags: Sukumar Mickey J Meyer Ashish Reddy Ivana Selfish Kashi Vishal Dil Khush

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!