Mammootty: మమ్ముట్టికి 15వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు - సంతోషం లేదన్న మెగాస్టార్, కారణం ఏంటంటే..
Mammootty Emotional Speech: ఫల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి భావోద్వేగానికి లోనయ్యారు. 15వ ఫిల్మ్‌ఫేర్ అందుకున్న ఆయన తనకు ఇది సంతోషం ఇవ్వడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Mammootty Emotional Speech After he Received 15th Filmfare Award: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకల్లో ఎమోషనల్ అయ్యారు. 15వ సారి ఫిల్మ్‌ఫేర్ అందుకుంటున్న ఆయన ఇందుకు పెద్దగా సంతోషించడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి కారణం ఇదేనని అసలు విషయం ఇలా చెప్పుకొచ్చారు. కాగా ఫిల్మ్‌ఫేర్ (సౌత్) 2024 అవార్డుల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలు, హీరోయిన్‌లు, నటీనటులు హాజరయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్, మాల్లీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ పురస్కారాలు.
ఉత్తమ నటుడిగా 15వ ఫిల్మ్‌ఫేర్
తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోని పలు చిత్రాలకు, నటీనటులకు పురస్కారాలు అందించారు. మాలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన 'నాన్పకల్ నెరతు మయక్కమ్' సినిమాకుగానూ ఆయన ఉత్తమ నటుడిగా అవార్డు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ వేడుల్లో ఆయన ఈ అవార్డుకు గెలుచుకున్నారు. ఇక తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, సిద్ధార్థ్ చేతుల మీదుకు ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. "ఇది నా 15వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు. 'నాన్పకల్ నెరతు మయక్కమ్'లో నేను ద్విపాత్రాభినయం చేశాను. మలయాళ సినిమా అయినా తమిళ భాషల్లోనూ మాట్లాడాను. ఇందులో ఒక పాత్ర తమిళ్ మాట్లాడాలి. అందుకే రెండు భాషల్లో మాట్లాడాను. ఇక ఈసినిమాను నేనే నిర్మించాను. సినిమా మంచి విజయం సాధించింది.
.@mammukka received his 15th Film Fare award and in his thanks giving speech he has appealed for the people of Wayanad who is affected by the Landslides ♥️#Mammoottypic.twitter.com/j0ZIw0RBLo
— AB George (@AbGeorge_) August 4, 2024
ఆ సంఘటన మనసుని కలిచివేస్తోంది
ఇందుకు తొడ్పాటు అందించిన నా టీంకి కృతజ్ఞతలు. నిజానికి ఈ క్షణం నేను సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ, నాకు ఆ ఆనందమే లేదు. అవార్డు అందుకున్న పెద్దగా నా మనసు ఉత్సాహించడం లేదు. కారణం కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు నిరాశ్రులయ్యారు. సొంతవారిని పోగోట్టుకున్నారు. కటుంబాలు కటుంబాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎంతోమంది అడవుల్లో చిక్కుకుని బిగ్గుబిగ్గుమంటున్నారు. ఈ ప్రమాదం మనసుకు కలిచివేస్తోంది.దయచేసి మీరూ కూడా వయనాడ్‌కు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరంతా ఎంతో కొంత సాయం చేసిన వయనాడ్ బాధితులకు చేయూత ఇవ్ఆలని కోరుకుంటున్నాను" అంటూ మమ్ముట్టి ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం ఆయన స్పీచ్ ప్రతి ఒక్కరిని హ్రదయాన్ని హత్తుకుంటుంది. బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకొవడం ఆయనకు ఎంతో ఆనందకరమైన క్షణాలు. ఇలాంటి క్షణాల్లో కూడా వయనాడ్‌ను వరదలు ముంచెత్తిన సంఘటనను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేయడం మరోసారి ఆయనను మెగాస్టార్‌గా మరో మెట్టుకు ఎదిగేలా చేసింది. ఈ సంఘటనతో ఆయన రీల్ హీరో మాత్రమే కాదు రీయల్ హీరో అని మరోపారి నిరూపించుకున్నారు. కాగా ఈ వయనాడ్ బాధితుల కోసం మమ్ముట్టి రూ. 20 లక్షలు విరాళం అందించిన సంగతి తెలిసిందే. తనతో పాటు తన సహా నటులు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునివ్వడం గమనార్హం. కాగా మమ్ముట్టి సామాజీక సేవ కార్యక్రమాల్లో ముందుటారనే విషయం తెలిసిందే. గతంలో ఇలాంటి వరద సంఘటలకు ఆయన ఆర్థిక సాయం చేసి చేయూతనిచ్చారు.
Also Read: లావణ్యపై తరచూ ఆరోపణలు - శేఖర్ భాషాపై దాడి, ఆస్పత్రి బెడ్‌పై నుంచి వీడియో రిలీజ్!