అన్వేషించండి

Aavesham 2 Update : 'ఆవేశం 2'పై ఫహద్ క్లారిటీ - రంగా ఈజ్ బ్యాక్... బ్లాక్ బస్టర్ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?

Fahadh Faasil Aavesham 2 : మలయాళ స్టార్ పహద్ ఫాజిల్ 'ఆవేశం 2'పై క్లారిటీ ఇచ్చారు. బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని... పనులు జరుగుతున్నాయని అన్నారు.

Fahadh Faasil Confirms Aavesham 2 : మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'ఆవేశం' మూవీ. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మలయాళ సినిమా దాదాపు రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. రౌడీ షీటర్ రంగాగా ఫహాద్ నటన ఆడియన్స్‌ను కట్టి పడేసింది. తాజాగా 'ఆవేశం' సీక్వెల్‌పై ఫహాద్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

'ఆవేశం 2' ఎప్పుడంటే?

'ఆవేశం 2'పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఫహద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'ఆవేశం 2' సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని... ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 2027 లేదా 2028లో ఈ మూవీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక, మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'పేట్రియాట్'లో తాను నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. 

'ఆవేశం' మూవీకి జీతూ మాధవన్ దర్శకత్వం వహించగా... ఆయన ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో మూవీ చేస్తున్నారు. హై ఎనర్జీ కాప్ యాక్షన్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కుతుండగా... ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే జీతూ మాధవన్ 'ఆవేశం 2' పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.ఆ

Also Read : సన్నీ లియోన్ క్రైమ్ థ్రిల్లర్ - మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీలో 'ఆవేశం' స్ట్రీమింగ్

'ఆవేశం' మూవీలో ఫహద్ ఫాజిల్‌తో పాటు హిప్ స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏంటంటే?

ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుదామని కేరళ నుంచి బెంగుళూరు వచ్చిన ముగ్గురు యువకులు ప్రైవేట్ హాస్టల్‌లో దిగుతారు. వీరిని సీనియర్లతో పాటు వారి స్నేహితులు దారుణంగా ర్యాగింగ్ చేస్తారు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన ముగ్గురూ వారికి బుద్ధి చెప్పాలని గ్యాంగ్ స్టర్ రంగా (ఫహద్) సాయం కోరతారు. ర్యాగింగ్ విషయం తెలిసి వారికి బుద్ధి చెప్తాడు. అయితే, రంగా ఎవరినైనా తన వారు అనుకుంటే ప్రాణం ఇస్తాడు. కోపమైనా అంతే.

రంగా మనుషులంటూ ఆ ముగ్గురి యువకులపై ముద్ర పడగా చదువు మూలన పడి అన్నీ సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అవుతారు. దీంతో ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్లి చదువుకుందామని అనుకుంటారు. కానీ రంగా వీరిని వదిలిపెట్టడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? రంగా నుంచి ఆ ముగ్గురు యువకులు ఎలా తప్పించుకున్నారు? దీనికి రంగా ఎలా రియాక్ట్ అయ్యాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Embed widget