Kennedy OTT : సన్నీ లియోన్ క్రైమ్ థ్రిల్లర్ - మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Kennedy OTT Platform : సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'కెన్నడీ' మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. తాజాగా అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు.

Sunny Leone's Kennedy Movie OTT Release Date Locked : బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'కెన్నడీ'. మూడేళ్ల క్రితమే ఈ మూవీ పూర్తైనా రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా ఇతర జియో మామి వంటి వేదికలపై సినిమాను ప్రదర్శించగా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'కెన్నడీ' మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్‌తో పాటు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. 'సిస్టమ్ కెన్నడీని ఓ ఆయుధంగా తయారు చేసింది. కానీ ఈ ఆయుధం సిస్టమ్ ఆదేశాల మీద కాదు. తన సొంత ఇష్టంతో పని చేస్తుంది.' అంటూ రాసుకొచ్చింది.
ఈ మూవీకి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించగా... రాహుల్ భట్, సన్నీ లియోన్ కీలకపాత్రలు పోషించారు. వీరితో పాటే మోహిత్ తకాల్కర్, అభిలాష్ తప్లియాల్, మేఘా బర్మన్, కరిష్మా మోదీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో 'ఛార్లీ' పాత్రలో నటించి సన్నీ మెప్పించారు.
View this post on Instagram
Also Read : 'జన నాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్! - వెనక్కి తగ్గిన మేకర్స్... వారం రోజుల్లోనే...
స్టోరీ ఏంటంటే?
ఉదయ్ శెట్టి (రాహుల్ భట్) అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తాను చనిపోయినట్లు అందరినీ నమ్మిస్తాడు. కానీ 'కెన్నడీ' అంటూ పేరు మార్చుకుని క్రైమ్‌కు పాల్పడుతుంటాడు. అవినీతి పోలీస్ కమిషనర్ కోసం కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారతాడు. ఇదే టైంలో కొన్ని అనారోగ్య సమస్యలతోనూ బాధ పడుతుంటాడు. తాను చంపిన వారి ఆత్మల భయం కెన్నడీని వెంటాడుతుంటుంది. దీంతో తీవ్ర నిద్ర లేమికి గురవుతాడు. సలీమ్ అనే వ్యక్తి కోసం వెతుకుతూ తన పాపాలకు ప్రాయశ్చితం కోరుకుంటాడు కెన్నడీ.
ఇదే సమయంలో ఛార్లీ (సన్నీ లియోన్) అనే మహిళ కెన్నడీకి పరిచయం అవుతుంది. వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ముంబైలో చీకటి కోణాలతో పాటు పొలిటికల్ లీడర్స్, నేరస్థుల మధ్య సంబంధాలను సినిమాలో చూపించారు. అసలు ఉదయ్ శెట్టి కెన్నడీగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఛార్లీకి కెన్నడీకి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
























