Pawan Kalyan Surender Reddy Movie : పవన్ సినిమాలో 'ఫౌజీ' హీరోయిన్? - రెబల్ స్టార్ తర్వాత పవర్ స్టార్‌తో...
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్, సురేందర్ రెడ్డి కాంబో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది.

Actress Imanvi In Talks To Heroine In Pawan Kalyan Surender Reddy Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త ఏడాది కొత్త మూవీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది.
'ఫౌజీ' హీరోయిన్?
ఈ సినిమాలో పవన్ సరసన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీని తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. డార్లింగ్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామను పవన్ సినిమాలో తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ రోల్ కోసం ఆమెను సంప్రదిస్తున్నారట. పవన్ పక్కన ఆమె అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.
పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న సినిమాలో పవన్ సరసన ఇమాన్వీ నటిస్తే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారుతుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అప్పుడు రెబల్ స్టార్, ఇప్పుడు పవర్ స్టార్ సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసిందంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read : గాంధీ జయంతికి వెంకీ AK47 - త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?
ఎవరీ ఇమాన్వీ?
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో పుట్టిన ఇమాన్వీ పూర్తి పేరు ఇమాన్వీ ఇస్మాయిల్. చదువుతో పాటు డ్యాన్స్‌లోనూ ఇంట్రెస్ట్ చూపిస్తూ... వెస్ట్రన్ డ్యాన్స్, భరత నాట్యం, కూచిపూడి, భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో ప్రావీణ్యం సాధించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఈ పాపులారిటీతోనే ఆమె ప్రభాస్ 'ఫౌజీ'లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సినిమాలోనే నటించే ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఇక పవన్, సురేందర్ రెడ్డి సినిమా విషయానికొస్తే... ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. గతేడాది 'OG'తో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు పవన్. ఆయన కెరీర్‌లో ఇది 32వ సినిమా. ఈ ప్రాజెక్టుకు వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారు. గతంలోనే ఈ మూవీ ట్రాక్ ఎక్కాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. 'జైత్ర రామ మూవీస్' బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మార్చిలో 'ఉస్తాద్'
ఈ ఏడాది సమ్మర్‌లో పవన్, హరీశ్ శంకర్ కాంబో అవెయిటెడ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 26న సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పవన్ లుక్స్, సాంగ్ అదిరిపోయాయి. 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ ట్రెండ్ అవుతోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా... రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
























