F3 Movie Update: సమ్మర్ సోగ్గాళ్ళు - ఊ ఆ ఆహా ఆహా - అందమైన భామలు
సమ్మర్ సొగ్గాళ్లు 'ఊ ఆ ఆహా ఆహా' అంటున్నారు. కొత్త పాటతో రావడానికి రెడీ అవుతున్నారు.
విక్టరీ వెంకటేష్ (Venkatesh - F3), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej - F3) కథానాయకులుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3' (F3 Movie). సమ్మర్ సొగ్గాళ్లు... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో రెండో పాటను విడుదల చేయడానికి టీమ్ రెడీ అయ్యింది. 'ఊ ఆ ఆహా ఆహా' (Woo Aaa Aha Aha Song) అంటూ సాగే ఆ పాటను ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు తెలియజేశారు.
'ఎఫ్ 3' సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఒక పాటను విడుదల చేశారు. 'లబ్ డబ్ లబ్ డబ్' అంటూ డబ్బు మీద రాసిన ఆ పాటను హీరోలపై తెరకెక్కించారు. రెండో సాంగ్ మాత్రం హీరో హీరోయిన్లపై తీసినట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. మిల్కీ బ్యూటీస్ తమన్నా, మెహరీన్ తో పాటు సోనాల్ చౌహన్ కూడా ఈ పాటలో ఉన్నారు.
Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత
వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ కౌర్, మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఇతర తారాగణం. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక గీతం చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మే 27న సినిమా విడుదల కానుంది.
Also Read: అంటే లీలాతో జంటగా సుందర్ - నాని సినిమా టీజర్ విడుదల ఎప్పుడంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.