అన్వేషించండి

Samantha Chitchat: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత

నయనతార గురించి, 'కన్మణి రాంబో ఖతీజా' సినిమా గురించి, దర్శకుడు విఘ్నేష్ శివన్ గురించి... సమంత ఏం చెప్పారంటే?

"నేను చాలా నవ్వుతాను. మిగతావాళ్ళు నవ్వని స్టుపిడ్ థింగ్స్‌కు నవ్వుతా. రోజులో కనీసం ఒక్కసారైనా నవ్వకపోతే నేను నేను కాదు" అని సమంత అన్నారు. సరదాగా కాసేపు ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. సూటిగా, సుత్తి లేకుండా సమంత (Samantha Instagram Chat) చెప్పిన సమాధానాలు... 

నయనతార మీ ఫ్రెండ్!
సమంత: ఆమె అసాధారణమైన వ్యక్తి (Nayanthara is Phenomenal, says Samantha). కన్మణి రాంబో ఖతీజా' సినిమాలో ఆమె నటన మీరంతా చూడాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పటివరకు నయనతార చేసిన సినిమాల్లో ఆమె బెస్ట్ పెర్ఫార్మన్స్.

కన్మణి లేదా ఖతీజా? (రెండు పాత్రలో మీకు ఏది ఇష్టం అని)
సమంత: కన్మణి అండ్ ఖతీజా! కన్మణి లేకుండా ఖతీజా లేదు, ఖతీజా లేకపోతే కన్మణి ఉండదు. 

దర్శకుడు విఘ్నేష్ శివన్ గురించి...
సమంత: వండ‌ర్‌ఫుల్‌ సినిమా (kaathuvaakula rendu kaadhal) తీశారు. అతని కోసం ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనసుపెట్టి మరీ పని చేశారు. 

విజయ్ సేతుపతి గురించి చెప్పండి
సమంత: లవ్ సింబల్ చూపిస్తూ... ఈ ఫొటో పోస్ట్ చేశారు.

Samantha Chitchat: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత

మీరు థియేటర్‌లో చూసిన మొదటి సినిమా?
సమంత: 'జురాసిక్ పార్క్'

'కన్మణి రాంబో ఖతీజా' (kanmani khatija rambo movie) సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
సమంత: రొమాంటిక్ కామెడీ నా ఫేవరెట్ జానర్. కొంత విరామం తర్వాత అటువంటి సినిమా చేస్తున్నాను. ఇట్స్ రియల్లీ ఫన్. ఏప్రిల్ 28న (Kanmani Rambo Khatija on April 28th) మీరంతా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. 

పియసింగ్ (piercing, నగలు పెట్టుకోవడం కోసం శరీరంపై కుట్టించుకుంటారు కదా! చెవి పోగులు తరహాలో) నొప్పి ఎలా తగ్గింది? మీరు ఏం చేశారు?
సమంత: ఈ విషయం గురించి ఒకరు అడగటం సంతోషంగా ఉంది. (చెవికి కుట్టించుకున్న పియసింగ్ చూపిస్తూ...) దీని గాయం / నొప్పి తగ్గడానికి ఆరు నెలలు పట్టింది. నేను ఏం చేశానో నాకు తెలియదు.
Also Read: సమంత మాటలకు అర్థం ఏమిటి? మరింత స్ట్రాంగ్‌గా బాడీ & మైండ్

మీరు ఏదైనా టాటూ వేయించుకోవాలని అనుకుంటున్నారా?
సమంత: మీకు ఓ విషయం తెలుసా?  ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దని నాకు నేను చెబుతా. 

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫాలోయర్లు 23 మిలియన్స్ అయ్యారు!
సమంత: నేను చాలా లక్కీ! థాంక్యూ

మీ సంతోషానికి సీక్రెట్ ఏంటి? (Secret of Samantha Ruth Prabhu Happiness)
సమంత: సీక్రెట్ ఏమీ లేదు. ప్రతి రోజూ నిద్రలేవడం, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం!

మీ తొలి సంపాదన ఎంత? (Samatha First Income)
సమంత: ఒక హోట‌ల్‌లో జ‌రిగిన కాన్ఫ‌రెన్స్‌కు ఎనిమిది గంట‌లు హోస్ట్ చేశా. రూ. 500 ఇచ్చారు. అప్పుడు పదో తరగతి అనుకుంట, లేదంటే ఇంటర్!

అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా? (Samantha suggestion to Young Women)
సమంత: మీ కలలను సాకారం చేసుకోండి. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మీపై (మీ ప్రతిభపై) ఎప్పుడూ సందేహాలు పెట్టుకోవద్దు. మీపై మీకు డౌట్ వచ్చేలా చేసే అవకాశం ఎవరికీ ఇవ్వవద్దు. 'మీరు బాలేరు' అని చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వవద్దు. గిల్టీగా ఫీల్ అవ్వొద్దు.
Also Read: సమంత వర్సెస్ అక్కినేని అఖిల్ - బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget