Ante Sundaraniki Movie Update: అంటే లీలాతో జంటగా సుందర్ - నాని సినిమా టీజర్ విడుదల ఎప్పుడంటే?
నాని, నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.
Ante Sundaraniki Movie Teaser on 20th April: నాని (Nani), నజ్రియా నజీమ్ (Nazriya Nazim) జంటగా నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్టు నేడు వెల్లడించారు.
Nani Nazriya Nazim first look from Ante Sundaraniki Movie: 'అంటే సుందరానికి' సినిమాలో సుందర్ పాత్రలో నాని, లీల పాత్రలో నజ్రియా నజీమ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. హిందూ సంప్రదాయ వేషధారణలో ఒక లుక్, క్రిస్టియన్ సంప్రదాయ వేషధారణలో మరో లుక్ విడుదల చేశారు. క్రిస్టియన్ అమ్మాయితో హిందూ యువకుడు ప్రేమలో పడితే? అనే కథాంశంతో సినిమా రూపొందించినట్టు సమాచారం.
Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత
తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళంలో 'ఆదదే సుందర' (Adade Sundara movie) పేరుతో, మలయాళంలో 'ఆహా సుందర' (Aha Sundara movie) పేరుతో విడుదల చేయనున్నారు. జూన్ 10న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.
Also Read: అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వేదాంత్ మాధవన్, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న నటుడు మాధవన్
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.