Dude Day 2 Collection: 60 కోట్లు దాటేశా 'డ్యూడ్' - బాక్సాఫీస్ వద్ద దీపావళి బొమ్మ బ్లాక్ బస్టర్
Dude Box Office Colletion Day 3: తమిళ స్టార్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 3 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.

Pradeep Ranganathan's Dude Movie Three Days World Wide Box Office Collection: 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో బిగ్ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. ఫస్ట్ 2 రోజుల్లోనే రూ.50 కోట్లకు చేరువలో ఉండగా మూడో రోజు ఆ మార్క్ దాటేసి రికార్డు కలెక్షన్స్ రాబట్టింది.
3 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
'డ్యూడ్' తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'డ్యూడ్ ఈ దీపావళి సీజన్ సొంతం చేసుకుంది.' అంటూ రాసుకొచ్చింది. ఫస్ట్ డే రూ.22 కోట్లు, రెండో రోజు రూ.23 కోట్లు, మూడో రోజు రూ.21 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇండియా వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. వీకెండ్స్‌తో దీపావళి సెలవులతో వసూళ్ల జోష్ కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: దీపావళి ఛాంపియన్ కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' - ఫస్ట్ డేను మించి రెండో రోజు కలెక్షన్స్
ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా... ప్రదీప్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే శరత్ కుమార్, రోహిణి, ద్రవిడ్ సెల్వం, హృదు హరూన్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ మూవీని నిర్మించగా... సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.





















