Kaantha Release Date: దీపావళికి దుల్కర్ సల్మాన్ సర్‌ప్రైజ్ - 'కాంత' రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Kaantha Movie: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' రిలీజ్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 12నే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడింది.

Dulquer Salmaan's Kaantha Movie Release Date Announced: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత'. దీపావళి సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 12నే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు.
రిలీజ్ ఎప్పుడంటే?
నవంబర్ 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దీపావళి మరింత ఉత్సాహంగా మారింది. నవంబర్ 14 నుంచి 'కాంత' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వెలుగులు నింపుతుంది.' అంటూ రాసుకొచ్చారు. మూవీలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
మూవీలో హీరో పాత్రలో దుల్కర్ నటిస్తుండగా... డైరెక్టర్ రోల్‌లో సముద్రఖని నటిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో ఇండస్ట్రీలో ఓ హీరోకు, డైరెక్టర్‌కు మధ్య జరిగిన ఘటనలు, గురువుతో సమానమైన డైరెక్టర్‌కు హీరో బద్ద శత్రువుగా ఎలా మారాడు? అనేదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా... స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెట్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఝును మ్యూజిక్ అందిస్తుండగా... రానా ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Also Read: ప్లాట్ ఫాంపై శవాలు... చేతిలో గన్ - ఇంటెన్స్ లుక్‌లో సంయుక్త... మూవీ ఏంటో తెలుసా?





















