Samyuktha: ప్లాట్ ఫాంపై శవాలు... చేతిలో గన్ - ఇంటెన్స్ లుక్‌లో సంయుక్త... మూవీ ఏంటో తెలుసా?
The Black Gold: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సంయుక్త హై యాక్షన్ ఎంటర్టైనర్ 'ది బ్లాక్ గోల్డ్' మూవీ నుంచి బిగ్ సర్పైజ్ వచ్చేసింది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

Samyuktha First Look From The Black Gold Movie: టాలీవుడ్ లక్కీ ఛార్మ్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'ది బ్లాక్ గోల్డ్'. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఇదివరకు ఎన్నడూ చూడని రోల్‌లో ఓ పవర్ ఫుల్ లుక్‌లో ఆమె కనిపించారు.
ఇంటెన్స్ లుక్
రైల్వే ప్లాట్ ఫాంపై శవాలు... వెనుక నుంచి రైలు... ఒంటినిండా గాయాలు... రక్తంతో తడిచిన చేతులు... ఇంటెన్స్ లుక్‌తో సంయుక్త భారీ హైప్ క్రియేట్ చేశారు. 'ది బ్లాక్ గోల్డ్' ఓ కంప్లీట్ హై యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. 'గందరగోళం, చీకటితో నిండిన ప్రపంచంలో ఆమె అన్నీ అసమానతలకు వ్యతిరేకంగా ఆశా దీపంగా నిలుస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. ఈ మూవీకి యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తుండగా... హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్, హై యాక్షన్‌తో ఓ సరికొత్త ప్రపంచాన్ని చూపించనున్నట్లు ఫస్ట్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. సంయుక్త పోలీస్ ఆఫీసరా? అనేది తెలియాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీని రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
'ది బ్లాక్ గోల్డ్' నటీనటులు & టెక్నికల్ టీం : కీ రోల్ : సంయుక్త, స్క్రీన్ ప్లే & దర్శకత్వం : యోగేష్ KMC, నిర్మాత : రాజేష్ దండా, సహ నిర్మాత: సింధు మాగంటి, డీవోపీ : ఎ వసంత్, సంగీతం: సామ్ సిఎస్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, కథ & డైలాగ్స్: యోగేష్ KMC & ప్రసాద్ నాయుడు, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: మధు విప్పర్తి, యాక్షన్: రామకృష్ణ, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి.





















