Raviteja: ఇండస్ట్రీలోకి మాస్ మహారాజ వారసుల ఎంట్రీ - ఏ మూవీస్‌కు వర్క్ చేస్తున్నారో తెలుసా?
Raviteja son Mahadhan: మాస్ మహారాజ రవితేజ వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. 'మాస్ జాతర' ప్రమోషన్లలో భాగంగా తన పిల్లల కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Raviteja Son Mahadhan Working As Assistant Director For Suriya46 Movie: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ వెంకీ అట్లూరితో రవితేజ చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కుమారుడు మహాధన్, కుమార్తె మోక్షద ఇండస్ట్రీ ఎంట్రీ గురించి మాట్లాడారు.
ఆ మూవీస్‌తోనే...
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్యతో మూవీ చేస్తున్నట్లు డైరెక్టర్ వెంకీ రవితేజతో చెప్తూనే... ఈ మూవీకి మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడని తెలిపారు. 'తన కుమారుడితో పని చేయడం ఎలా అనిపించింది?' అంటూ రవితేజ ప్రశ్నించగా... 'చాలా నేచురల్‌గా అనిపించింది. అతను చిన్నప్పటి నుంచీ సినిమా సెట్స్ మధ్యే పెరిగాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు.' అంటూ నవ్వుతూ చెప్పారు. ఇక మహాధన్ రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' మూవీలో ఆయన చిన్నప్పటి పాత్రలో కనిపించారు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ హీరో సినిమాకు పని చేస్తున్నారు. అయితే, భవిష్యత్తులో మహాధన్ హీరోగా ఎంట్రీ ఇస్తారా? లేదా డైరెక్టర్‌గా మారతారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇక సూర్య కెరీర్‌లో ఇది 46వ సినిమా కాగా... ఆయన డైరెక్ట్‌గా తెలుగులో నటిస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సూర్య సరసన 'ప్రేమలు' ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - దీపావళికి గుడ్ న్యూస్ చెప్పిన కపుల్
'వాళ్ల అక్కే చూసుకుంటుంది'
మహాధన్ కెరీర్ గురించి వాళ్ల అక్కే చూసుకుంటుందని రవితేజ చెప్పారు. 'మహాధన్ కెరీర్ గురించి మోక్షద దగ్గరుండి మరీ గమనిస్తోంది. వాడు ఏం విషయం అయినా సరే వాళ్ల అక్కతో షేర్ చేసుకుంటాడు. తను కూడా వాడికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది.' అంటూ వెల్లడించారు. ఇక మోక్షద సైతం ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్‌గా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబోలో ఎక్స్‌క్లూజివ్‌గా 'నెట్‌ఫ్లిక్స్' కోసం రూపొందిస్తోన్న 'తక్షకుడు' మూవీకి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టును సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో మోక్షద రవితేజ ప్రొడక్షన్ హౌస్ పేరుతో మూవీస్ కూడా నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఇక 'మాస్ జాతర' విషయానికొస్తే... రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఇది 75వ సినిమా. ఇందులో ఆయన ఆర్పీఎఫ్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్, లుక్స్ వేరే లెవల్‌లో ఉండగా... ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.





















