Parineeti Chopra: బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - దీపావళికి గుడ్ న్యూస్ చెప్పిన కపుల్
Parineeti Chopra Raghav Chadha: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్ స్టా వేదికగా ఈ శుభవార్తను షేర్ చేశారు.

Parineeti Chopra Welcomes Baby Boy With Her Husband Raghav Chadha: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా శుభవార్తను షేర్ చేశారు. 'ఈ క్షణం మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఇప్పటివరకూ మేం ఒకరికి ఒకరం ఉన్నాం. ఇప్పుడు మా సర్వస్వం కూడా వీడే.' అంటూ రాసుకొచ్చారు.
దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు విషెష్ చెబుతున్నారు. దీపావళికి సంతోషకరమైన వార్తను చెప్పారంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతి చోప్రా 2023 సెప్టెంబరులో వివాహం చేసుకున్నారు. తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ ఈ ఆగస్టులో రివీల్ చేశారు.
View this post on Instagram
Also Read: క్రిస్మస్ బరిలో భూమిక 'యుఫోరియా' - ఒకే రోజు 4 సినిమాలు... బాక్సాఫీస్ వద్ద ఏ బొమ్మ బ్లాక్ బస్టర్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పరిణీతి చోప్రా 2011లో వచ్చిన 'లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్' మూవీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కిల్ దిల్, గోల్ మాల్ అగైన్, సైనా, కేసరి, ఇష్క్ జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు. 'అమర్ సింగ్ చకీల' మూవీతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఆమె తన యూట్యూబ్ ఛానల్‌ను కూడా స్టార్ట్ చేశారు.





















