అన్వేషించండి

Don 3 Controversy: రణవీర్‌పై బ్యాన్... 40 కోట్లు ఇవ్వాలని డిమాండ్... 'డాన్ 3' కాంట్రవర్సీ ఫుల్ డీటెయిల్స్

Ranveer Singh Ban Vs Farhan Akhtar: బాలీవుడ్‌లో రణవీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ గొడవ హాట్ టాపిక్. 'డాన్ 3' విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు హీరోని బ్యాన్ చేసే వరకు వెళ్ళింది. అసలు ఏమిటీ గొడవ?

Don ko pakadna mushkil nahi namumkin hai 'డాన్‌ని పట్టుకోవడం కష్టమే కాదు... ఎవరి తరమూ కాదు (అసాధ్యం కూడా) - బాలీవుడ్ 'డాన్' సిరీస్‌లో హీరో పాపులర్ డైలాగ్. హీరో కోసం ఫర్హాన్ అక్తర్ పాట్లు చూస్తుంటే 'డాన్'ను పట్టుకోవడం కష్టమే అంటున్నారు కొందరు. బాలీవుడ్ 'ధురంధర్' రణవీర్ సింగ్, ఆయనకు మధ్య 'డాన్ 3' (Don 3) విషయంలో ఏర్పడిన అభిప్రాయబేధాలు హీరోపై బ్యాన్ విధించే వరకు వెళ్ళింది. అసలు ఏమిటీ గొడవ? వివాదానికి కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...    

బాద్షాను కాదని ధురంధురుడి దగ్గరకు...
ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్‌కు 'డాన్' అంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గుర్తుకు వస్తారు. కానీ, అసలు డాన్ అంటే అమితాబ్ బచ్చన్. ఫర్హాన్ తండ్రి జావేద్ అక్తర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ రాసిన కథతో అమితాబ్ హీరోగా మే 12, 1978లో 'డాన్' వచ్చింది. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ (యుగంధర్), తమిళంలో రజనీకాంత్ (బిల్లా) రీమేక్ చేశారు.

అమితాబ్ బచ్చన్ 'డాన్' కథకు మార్పులు చేసి 2006లో ఫర్హాన్ అక్తర్ మళ్ళీ సినిమా తీశారు. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. ఆ సినిమా హిట్టు. దానికి 2011లో సీక్వెల్ తీశారు. దానికీ డబ్బులు వచ్చాయి. అయితే 'డాన్ 3' విషయంలో షారుఖ్, ఫర్హాన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయి. పైగా, 'డాన్ 3' చేయడానికి ప్రజెంట్ జనరేషన్ యాక్టర్ కావాలన్నారు ఫర్హాన్. బాలీవుడ్ బాద్షాను కాదని 'ధురంధర్' రణవీర్ సింగ్ దగ్గరకు వచ్చారు.

ఆగస్టు 2023లో రణవీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 'డాన్ 3' టీజర్ విడుదలైంది. కియారా అద్వానీని కథానాయికగా ఎంపిక చేశారు. అప్పట్నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. పైగా, రణవీర్ 'డాన్ 3' టీజర్ విమర్శల పాలైంది. డాన్ అంటే షారుఖ్ అని, రణవీర్ అసలు సెట్ కాలేదని ట్రోల్స్ వచ్చాయి. ఒక దశలో రణవీర్ బదులు హృతిక్ రోషన్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని వినిపించింది. తర్వాత అటువంటిది ఏమీ లేదని తేలింది.     

షూటింగ్ మొదలు అవ్వకముందు అడ్డంకులు!
'డాన్ 3' షూటింగ్ మొదలు కావడానికి ముందే ఈ సినిమా అడ్డంకులు ఎదుర్కొంది. డాన్ రోల్ కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అవసరమని, తన పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కొంత సమయం కావాలని రణవీర్ సింగ్ రిక్వెస్ట్ చేశారు. ఇది జూలై 2025 నాటి మాట. '120 బహాదుర్'లో హీరోగా నటిస్తున్న ఫర్హాన్ అక్తర్, ఆ సినిమా కోసం 'డాన్ 3'ను కాస్త వెనక్కి తీసుకు వెళ్లారు. 

అయితే... డిసెంబర్ 2025 వచ్చేసరికి రణవీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ మధ్య గొడవలు మొదలు అయ్యాయని బాలీవుడ్ టాక్. స్క్రిప్ట్ మార్పులు చేయమని రణవీర్ సింగ్ సూచించారట. వయలెన్స్ అంత వద్దని, డైలాగుల్లో సీరియస్ టోన్ (జెన్ జి కిడ్స్ ఎంజాయ్ చేసేలా అసభ్య పదాలు వద్దని) కూడా చెప్పారట. దాంతో గొడవలు మరింత ముదిరాయి. రణవీర్‌తోనూ ఫర్హాన్‌కు క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయి.

'ధురంధర్' విజయంతో 'డాన్ 3' వద్దనుకున్న... 
ఒక వైపు క్రియేటివ్ డిఫరెన్స్, మరో వైపు 'ధురంధర్' సాధించిన భారీ విజయం... ఈ రెండిటి మధ్య 'డాన్ 3'ని రణవీర్ సింగ్ వద్దనుకున్నారని బాలీవుడ్ ఖబర్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్' రెండు భాగాల్లో వయలెన్స్ ఎక్కువ ఉంది. సో... 'డాన్ 3' వద్దని రణవీర్ చెప్పడానికి వయలెన్స్ రీజన్ కాదని, కథ నచ్చలేదని బాలీవుడ్ జనాలకు క్లారిటీ వచ్చింది. ఆయన సినిమా చేయనని చెప్పడంతో ఫర్హాన్ అక్తర్ ఫీలైనట్టు ముంబై వర్గాల గుసగుస.

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

మాతో 'డాన్ 3 చేయవా రణవీర్... 40 కోట్లు కట్టు!
'డాన్ 3' చిత్రీకరణ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు సినిమా నుంచి తాను తప్పుకొంటున్నట్టు రణవీర్ సింగ్ చెప్పడంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. ప్రీ ప్రొడక్షన్, లోకేషన్స్ వేట. టెక్నికల్ టీమ్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. రణవీర్ నిర్ణయం వల్ల తమకు బోలెడు నష్టం వాటిల్లిందని, అందుకోసం 40 నుంచి 45 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ వివాదం రణవీర్ మీద బ్యాన్ విధించే వరకు వెళ్ళింది. 

బ్యాన్ విధించడం వల్ల ఏమవుతుంది?
'డాన్ 3' చేయనని రణవీర్ సింగ్ చెప్పడంతో ఫర్హాన్ అక్తర్ వదల్లేదు. ఈ గొడవను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) దగ్గరకు తీసుకు వెళ్లారు. రణవీర్ మీద కంప్లైంట్ చేశారు. దాంతో హీరోపై బ్యాన్ విధించారు. అతనికి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు.

Also Read: Tamil Nadu CM Vijay Success Formula - కమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

బ్యాన్ విధించడం వల్ల రణవీర్ సింగ్‌తో ఎవరూ పని చేయకూడదు. నిషేధం ఉన్నన్ని రోజులూ ప్రొడక్షన్ హౌస్‌లు, స్టూడియోలు, టెక్నీషియన్లు అతనితో ఎటువంటి సినిమాలు లేదా యాడ్స్ చేయకూడదు. ఈ వివాదానికి ముగింపు పలకడానికి రణవీర్ సింగ్ ప్రయత్నించారట. తాను తీసుకున్న రూ. 10 కోట్ల అడ్వాన్స్ అమౌంట్‌ను తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.

ఎయిర్ పోర్టులో మాస్కుతో... మౌనంగా ఉండాలని!
తనపై బ్యాన్ విధించిన విషయం బయటకు వచ్చిన తర్వాత రణవీర్ సింగ్ నుంచి రియాక్షన్ వచ్చింది. ఆయన పీఆర్ టీమ్ నుంచి ఓ స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది.

'డాన్ 3' వివాదంపై రణవీర్ సింగ్ మౌనాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారని, వృత్తిపరమైన (సినిమా సంబంధిత) విషయాలను హుందాగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు హీరో టీమ్ పేర్కొంది. 'డాన్' ఫ్రాంచైజీపై రణవీర్‌కు ఎంతో గౌరవం ఉందని, ఆ చిత్ర బృందానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరోక్షంగా సినిమా నుంచి వైదొలినట్టు స్పష్టం చేశారు. బ్యాన్ విధించిన మర్నాడు ఎయిర్ పోర్టులో రణవీర్ సింగ్ కనిపించారు. ముఖానికి మాస్క్, కళ్ళకు సన్ గ్లాసెస్ ధరించి పాపరాజీ (మీడియా ప్రతినిధుల)తో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. బాలీవుడ్ పెద్దలు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget