Director Vamsy: వంశీ 'పసలపూడి కథలు'పై పరిశోధనకు డాక్టరేట్
ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి రాసిన 'పసలపూడి కథలు'పై పరిశోధనకు ఒక లెక్చరర్ డాక్టరేట్ అందుకున్నారు.
ప్రముఖ దర్శకులు వంశీ (Director Vamsy) ని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ఆయన సినిమాలు చూసినా... కథలు చదివినా... గోదావరి పరివాహక ప్రాంతంలో మనుషులు మన కళ్ళ ముందు మెదిలినట్టు ఉంటారు. అంత సజీవంగా ఆయన రచన ఉంటుంది.
ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు (Pasalapudi Kathalu) ఎంతో ఫేమస్. విపరీతమైన పాఠకాదరణ పొందిన ఆ కథలపై తూర్పు గోదావరికి చెందిన ఒక లెక్చరర్ కె. రామచంద్రా రెడ్డి పీహెచ్‌డీ చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో 'పసలపూడి' వంశీ సొంతూరు అయితే... దానికి సమీపంలో గల 'గొల్లల మామిడాడ' కె. రామచంద్రారెడ్డి ఊరు. ఆయన 24 ఏళ్లుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పసలపూడి కథలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకని, తన పీహెచ్‌డీకి పరిశోథనాంశంగా ఎంచుకున్నారు.
కె. రామచంద్రా రెడ్డి గోదావరి కాబట్టి అక్కడి యాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా (PHD Doctorate On Vamsy Pasalapudi Kathalu) అందుకున్నారు. 'మా పసలపూడి కథలు - ఒక పరిశీలన' అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని ఆయన రచించారు.
Also Read : థియేటర్లకు జనాలు రావడం లేదంటే నమ్మను, ఇండస్ట్రీకి ఇది గడ్డు కాలం కాదు - ఎన్టీఆర్
View this post on Instagram
వంశీ 'పసలపూడి కథలు'పై పీహెచ్‌డీ చేసిన కె. రామచంద్ర రెడ్డి... తన పరిశోధనను మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజించారు. వాటిలో రచయితతో ముఖాముఖితో పాటు బాపు - రమణల ప్రశంసా కవిత, వంశీ కథలకు బాపు గీసిన బొమ్మలు, కథల్లోని ప్రాంతాల ఫోటోలతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.
Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?