Director Shankar: ఐదు గంటల సినిమా తీశా... ‘గేమ్ ఛేంజర్’ అవుట్ పుట్‌పై శంకర్ షాకింగ్ కామెంట్ - రివ్యూలపై కూడా
Director Shankar About Game Changer Output: గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ పై డైరెక్టర్ శంకర్ ఊహించని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.
Shankar Comments on Game Changer Output: భారీ అంచనాల మధ్య విడుదలైన 'గేమ్ ఛేంజర్' మూవీ ఊహించని విధంగా టాక్ అందుకుంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని ఆశపడ్డ అభిమానులను నిరాశ పరిచింది. డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ (Ram Charan)ల కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. రామ్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా అప్పన్న పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ రోటిన్ కథ, కథనం, ఎమోషన్ పండని సీన్స్ కారణంగా సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ డే ఈ సినిమా రూ. 186 పైగా గ్రాస్ రాబట్టిన 'గేమ్ ఛేంజర్' అదే జోరును కొనసాగించలేకపోయింది. మరోవైపు కొద్ది రోజులుగా 'గేమ్ ఛేంజర్' తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ శంకర్ మూవీపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. మూవీ అవుట్ పుట్ గురించి ఆయన చేసిన కామెంట్స్ కి నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.
అవుట్ పుట్ తో సంతోషంగా లేను
తమిళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'గేమ్ ఛేంజర్' అవుట్ పుట్ తో తాను సంతోషంగా లేనన్నారు. ఇంకా ఆయన మాట్లడుతూ... ‘‘నేను అనుకున్న ప్రకారం ఈ సినిమా 5 గంటల నిడివి వరకు ఉండాలి. అయితే మూవీ టైంకి ఉన్న ఆంక్షల కారణంగా పలు సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కథ అనుకున్న విధంగా రాలేదు. గేమ్ ఛేంజర్ తో నేను చెప్పాలనుకుంది సరిగా చూపించలేకపోయాను’ అని అన్నారు. అలాగే ‘గేమ్ ఛేంజర్‘కి రామ్ చరణ్, ఎస్.జే సూర్యల నటనే బలం అన్నారు. వారి యాక్టింగ్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ఇంతవరకు గేమ్ ఛేంజర్ ఆన్ లైన్ రివ్యూలు తాను చూడలేదని, తనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ కు మంచి రివ్యూలు వచ్చినట్టు విన్నాను అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ దర్శకుడిగా సినిమా రిలీజ్ తర్వాత టాక్ ఎలా ఉంది, రివ్యూలు ఎలా వచ్చాయనేది కనీసం తెలుసుకోవాల్సిన అంశమని, అలాంటి ఆన్ లైన్ రివ్యూస్ చూడలేదనడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు రివ్యూలు చూడకుండ అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ జనరేషన్ ఆలోచనలు ఎలా తెలుస్తాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొదటి నుంచి డిజప్పాయింట్
ప్రకటనతోనే గేమ్ ఛేంజర్ చిత్రంపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. శంకర్ లాంటి డైరెక్టర్ కి రామ్ చరణ్ జతకావడంతో ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ అవుతుందో అని అంచనాలు వేసుకున్నారు. పైగా శంకర్ స్ట్రయిట్ తెలుగు మూవీ ఇదే కావడం, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని మొదటి నుంచి గేమ్ ఛేంజర్ టీం డిసప్పాయింట్ చేస్తూనే వస్తుంది. షూటింగ్ ని స్లో స్లోగా ముందుకు తీసుకురావడం, పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోవడం, రిలీజ్ డేట్ తరచూ వాయిదా వేస్తుండటంతో అభిమానులు అసహానికి గురయ్యారు. ఇవేవి లేకపోయిన శంకర్ పై మాత్రం చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ సంక్రాంతికి మెగా అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఓ భారీ హిట్ ఇస్తాడని ఆశపడ్డారు.
Also Read: కెరీర్‌లో ఒక్క ప్లాప్ కూడా చూడని బ్లాక్ బస్టర్ పొంగల్ డైరెక్టర్... అనిల్ రావిపూడి సక్సెస్ మంత్ర ఇదే
కానీ అందరి అంచనాల తలకిందులు అయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా రివ్యూస్ అందుకుని గేమ్ ఛేంజర్ డివైడ్ టాక్ కి సొంతం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు గడ్డు పరిస్థితులను చూస్తుంది. సినిమాకు కాస్తా నెగిటివ్ టాక రావడం, పోటీ డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో గేమ్ ఛేంజర్ స్పందన కరువైందనే చెప్పాలి. మరోవైపు మూవీకి పైరసి బెడద. రిలీజ్ కు ముందు కొందరు కావాలని కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో లీక్ చేశారు. తాజాగా సినిమా విడుదలైన నాలుగు రోజులకే ఏపీలోని లోకల్ టీవీ ఛానళ్లలో మూవీని ప్రసారం చేయడంతో గేమ్ ఛేంజర్ టీం గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ టీం సైబర్ క్రైం ప్రోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొందరు తమకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాను ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తామని హెచ్చరించడంతో నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది.