అన్వేషించండి

Anil Ravipudi: కెరీర్‌లో ఒక్క ప్లాప్ కూడా చూడని బ్లాక్ బస్టర్ పొంగల్ డైరెక్టర్... అనిల్ రావిపూడి సక్సెస్ మంత్ర ఇదే

Anil Ravipudi Success Mantra: ఇండస్ట్రీలో ఇంత వరకు ఒక్క ప్లాప్ చూడని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. 'పటాస్'తో మొదలు 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు ఆయన హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్సే అందుకున్నారు.

Anil Ravipudi Sankranti Hit Director: ‘సంక్రాంతికి వస్తున్నామం’ అంటూ ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేశాడు విక్టరీ వెంకటేష్. ఫస్ట్ షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా కామెడీతో నవ్విస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. థియేటర్లలో స్పందన చూస్తుంటే ఫైనల్‌గా ఈ సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ అని చెప్పాలి. దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. పర్ఫెక్ట్ సంక్రాంతి హిట్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు. 'పటాస్'తో మొదలు ఫెయిల్యూర్ అనేది లేకుండ వంద శాతం సక్సెస్ కొనసాగిస్తున్నారు. ఇంతకి ఆయన హిట్ స్ట్రైక్ రేట్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి సక్సెస్ మంత్ర ఏమిటి? చూద్దాం. 

ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్. ఎంతటి స్టార్ హీరోలకైనా, డైరెక్టర్సైనా, నిర్మాతలైన  హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో ప్లాప్స్ ని కూడా చూశారు. కానీ కంటిన్యూ హిట్స్ మాత్రం కొందరికే సాధ్యం. ఆ జాబితాలో దర్శక ధీరుడు జక్కన్న మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్ని సూపర్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టాయి. ఇప్పుడు ఈ జాబితాలో అనిల్ రావిపూడి చేరారు. ఇప్పటి వరకు అసలు ప్లాప్ అనేది చూడలేదు ఈ యంగ్ డైరెక్టర్. 2015లో పటాస్ కెరీర్ ప్రారంభించి.. తాజాగా సంక్రాంతి వస్తున్నాం వరకు ఆయన ఖాతాలో ఒక్క ఫ్లాప్ లేదు. 

పటాస్ తో మొదలు..

అనిల్ రావిపూడి ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించారు. కామెడీ ప్రధానంగా పటాస్ (2015) స్క్రీన్ ప్లే రాసుకున్నారు. థియేటర్లో పటాస్ కామెడీ బాగా పండింది. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ బాగా నవ్వించింది. దీంతో మళ్లీ మళ్లీ పటాస్ చూసేందుకు ఆడియన్స్ వచ్చారు. చివరకు పటాస్ బ్లాక్ బస్టర్ హిట్. అప్పటి వరకు పెద్దగా సక్సెస్ లేని కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ అందించాడు. తొలి సినిమా భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోలు ఆయన వైపు మొగ్గు చూపారు.

Also Read: డేంజర్ జోన్‌లో పూజా హెగ్డే టాలీవుడ్ కెరీర్... మూడేళ్ళ గ్యాప్, చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు, ఎందుకిలా?

ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ హీరోగా 'సుప్రీమ్' (2015) తీశాడు. ఇది కూడా సూపర్ హిట్. ఇందులో కామెడీ, ఎమోషన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ కూడా మెప్పించాయి. కామెడీ, ఎమోషన్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పండటంతో మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఈ సినిమాతో భారీ విజయం సాధించడం సాయి ‘ధరమ్ తేజ్’ సుప్రీమ్ హీరోగా మారాడు. 

'రాజా ది గ్రేట్'తో ప్రయోగం

మూడో సినిమాకు మాస్ మహారాజ రవితేజను లైన్ లో పెట్టాడు. ఇందులో కామెడీతో పాటు పలు సీరియస్ అంశాలను కూడా జోడించాడు. హీరోకి దృష్టి లోపం (కళ్లు కనిపించకపోవడం) పెట్టాడు. ఈ విషయం హీరోకి కళ్లు కనిపించకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. అనిల్ రావిపూడిని నమ్మి రవితేజ సాహసం చేస్తున్నాడని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో తన కామెడీకి ఎక్స్ ట్రా ఎలిమెంట్ యాడ్ చేశాడు. ఈ సినిమాతో మొదలు కామెడీ ట్రాక్ కి సిగ్నెచర్ డైలాగ్ పెట్టడం మొదలు పట్టాడు, ఇట్స్ టైం టూ ఊహుహూ.. అంటూ సిగ్నేచర్ డైలాగ్ తో తన మార్క్ చూపేట్టారు. ఫైనల్ రాజా ది గ్రేట్ కూడా సూపర్ హిట్. కళ్లు కనిపించని హీరోతో కామెడీ, యాక్షన్ చేయించి విమర్శకులను సైతం మెప్పించాడు. దీంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. 

సంక్రాంతి సినిమాలు... ఎఫ్ 2, సరిలేరు నీకేవ్వరు!

అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ప్రధానంగా ఉంటుంది. అలాంటి వెంకటేష్ కాంబినేషన్ సెట్ అయితే. ఈ సినిమాలో వినోదం నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. అనుకున్నట్టుగానే ‘ఎఫ్ 2’ (2019)లో కామెడీ నెక్ట్స్ లెవెల్లో పండింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఇందులో వరుణ్ తేజ్ మరో హీరో. భార్య వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ని వెంకి ఆసనం అంటూ సిగ్నెచర్ పాయింట్ పెట్టాడు మరోసారి తన మార్క్ చూపించారు అనిల్. వీరిద్దరి కాంబోలో కామెడీ అదిరిపోవడం ఏకంగా ఎఫ్ 2 రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి మరింత క్రేజ్ పెరిగిపోయింది. దీంతో నెక్ట్స్  ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లైన్లోకి వచ్చారు. 

మహేష్ బాబుతో 'సరిలేరు నీకేవ్వరు' (2020) అంటూ మరోసారి సంక్రాంతికి వచ్చారు. మహేష్ సినిమాలో డైలాగ్స్ కి ప్రత్యేకత ఉంటుంది. అది అనిల్ రావిపూడికి మరింత ప్లస్ అయ్యింది. మహేష్ చేత కామెడీ, సీరియస్ డైలాగ్స్, యాక్షన్ చేయించి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇందులో ట్రైయిన్ కామెడీ సీన్ బాగా పండింది. ఎమోషన్ కూడా మెప్పించింది. దీంతో సంక్రాంతి హిట్ గా నిలిచిన ఈ సినిమా రూ. 250  కోట్లపైగా వసూల్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఎఫ్ 2 కి సీక్వెల్ ఎఫ్ 3 (2022)తీసుకువచ్చారు. ఈ సినిమా కలెక్షన్స్ బాగానే సోంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టి హిట్ అందుకుంది. 2023 బాలయ్యతో భగవంత్ కేసరి తీశారు. ఈ సినిమా తన కామెడీ మార్క్ తగ్గించి సీరియస్ మోడ్ లోకి వచ్చారు. బాలయ్య మ్యానరిజం తగ్గట్టుగా కథ రాసుకుని యాక్షన్ మోడ్ లోకి దిగారు. ఇందులో కూతురి సెంటిమెంట్ ను ప్రధానంగా తీసుకుని సంక్రాంతికి వచ్చాడు. కట్ చేస్తే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్.

వరుసగా రూ. 100 కోట్లు

కేవలం హిట్ మాత్రం కాదు వసూళ్లు పరంగానూ దుమ్ముదులిపింది. రూ. 100 కోట్ల మార్క్ కొట్టేసింది. ఇక ఈ ఏడాది 2024 సంక్రాంతికి మరోసారి వెంకీ మామతో కలిసి వచ్చాడు. చూస్తుంటే ‘సంక్రాంతి వస్తున్నాం’ పర్పెక్ట్ పండగ మూవీ అంటున్నారు. తొలి రోజు థియేటర్లలో 90 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ఈ సినిమానే ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. చూస్తుంటే ఈ మూవీ కూడా  సూపర్ హిట్ వైపు దూసుకుపోయేలా కనిపిస్తుంది. ఇలా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ కొడుతూ పర్పెక్ట్ సంక్రాంతి డైరెక్టర్ అనిపించుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కమెడీ ప్రధానంగా తన సక్సెస్ మంత్రని కొనసాగిస్తున్నారు. ఆయన సినిమాలు అంటే ఆడియన్స్ లో పెద్దగా అంచాలు ఏముండవు. అనిల్ రావిపూడి అంటే కామెడీ తో మ్యాజిక్ చేస్తాడు.. ఆయన సినిమా కి వెళితే వందశాతం వినోదం పక్కా అనేది ప్రేక్షకుల అభిప్రాయం. అందుకే అనిరావిపూడి సినిమా అంటే ఖచ్చితంగా థియేటర్ వెళ్లాలి అని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. అలా అనిల్ రావిపూడి ఫెయిల్యూర్ అనేది లేకుండ సక్సెస్ ని కొనసాగిస్తున్నారు. 

Also Read'గేమ్ చేంజర్'ను కోలుకోలేని దెబ్బ తీసిన లోకల్ టీవీ... సినిమాను అలా ఎలా టెలికాస్ట్ చేశార్రా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
Chandrababu with Bloomberg: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
Hydra Vs Danam : హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
Tollywood IT Raids: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
Chandrababu with Bloomberg: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
Hydra Vs Danam : హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
హైడ్రాపై మరోసారి దానం గరం గరం - సీఎం రాగానే సంగతి చూస్తానంటూ హెచ్చరికలు
Tollywood IT Raids: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
Viral News: అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
Viral Video: కాస్త చూసుకోవాలి కదా బాసూ! - కారు పార్క్ చేస్తూ రివర్స్ గేర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ వాహనం, వైరల్ వీడియో
కాస్త చూసుకోవాలి కదా బాసూ! - కారు పార్క్ చేస్తూ రివర్స్ గేర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ వాహనం, వైరల్ వీడియో
New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
Monalisa: మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
Embed widget