Prasanth Varma Emotional: ప్రపంచంలో ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు - 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్
Prasanth Varma: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ అయ్యారు. ప్రపంచంలో ఇంతకంటే గోప్ప అనుభూతి లేదంటూ ఆయన ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.
![Prasanth Varma Emotional: ప్రపంచంలో ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు - 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ Director Prasanth Varma Shared School Students Video Who Enjoying While Watching Hanuman Movie Prasanth Varma Emotional: ప్రపంచంలో ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు - 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/23/a3f808f7cd5564e4b12eb56cd6d795ab1711135819967929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hanuman Director Prasanth Varma Shared School Kids Video: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజ సజ్జ-అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు 'గుంటూరు కారం', వెంకటేష్ సైంధవ్ ఇలా స్టార్ హీరో సినిమాలతో పోటీకి దిగి వాటన్నింటిని వెనక్కి నెట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కేవలం రూ. 40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం థియేట్రీకల్ రన్‌లో దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన 'హనుమాన్' ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతుంది.
ఇటీవల జీ5కి వచ్చిన సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చిన కొన్ని గంటల్లోనే అత్యధిక మిలియన్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్పింది. జస్ట్ పదకొండు గంటల్లోనే హనుమాన్ ఓటీటీలో నిమిషానికి మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా వరల్డ్ వైడ్‌గా ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో నిలిచి ట్రెండింగ్ వచ్చింది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్ 'మూవీకిగాను బెస్ట్ డైరెక్టర్‌గా రేడియో సిటి ఐకాన్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హనుమాన్ తొలి అవార్డు అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఆ పోస్ట్ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. 'హనుమాన్' సినిమా చూస్తు కొంతమంది విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. విద్యార్థుల కోసం 'హనుమాన్' మూవీని మిని స్క్రిన్‌పై ప్రదర్శించారు. ఇక సినిమా చూస్తు వారంత హనుమాన్.. హనుమాన్ అంటూ చప్పుట్లు కొడుతూ కేకలు వేస్తున్నారు. ఈ వీడియోను ప్రశాంత్ వర్మ షేర్ చేస్తూ ఇంతకంటే గొప్పు అనుభూతి ఇంకేముందంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. "చాలా మంది పిల్లలను సంతోష పెట్టడం కంటే గొప్ప అనుభూతి ప్రపంచంలో లేదు!" అంటూ ఎమోషనల్ ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఇది చూసి నెటిజన్లు అంతా ప్రశాంత్ వర్మ పనితనాన్ని కొనియాడుతున్నారు.
View this post on Instagram
'హనుమాన్' మూవీతో పిల్లలనే కాదు మూవీ లవర్స్, ప్రేక్షకులను ప్రతి ఒక్కరి ఆనందపరిచారని, చాలా మంది అభిమానాన్ని పొందారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'హనుమాన్' మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. 'కల్కి', 'ఆ!', 'జాంబిరెడ్డి' వంటి సినిమాలతో తన టాలెంట్ చూపించిన ప్రశాంత్ వర్మ 'హనుమాన్'తో ఏకంగా సినిమాటిక్ వరల్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు గతంలో ఓ ఇంటర్య్వూలో తన దగ్గర ఇంకా సూపర్ హీరో జానర్లో మైథలాజికల్ కథలు చాలానే ఉన్నాయని చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో అంతా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్ ఎలా ఉండబోతుందోని ఎదురుచూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)