Rajamouli Post: జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌కి మరో అరుదైన గౌరవం - ఆ మహిళలు చేసిన పనికి జక్కన ఫిదా, ఉబ్బితబ్బిబ్బవుతున్నానంటూ పోస్ట్
SS Rajamoli Post: జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ఈ పాన్ ఇండియా మూవీ రీ-రిలీజ్‌లోనూ సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా అక్కడ విశేష ఆదరణ పొంతుతుంది.
SS Rajamoli Post: జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ఈ పాన్ ఇండియా మూవీ రీ-రిలీజ్‌లోనూ సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా అక్కడ విశేష ఆదరణ పొంతుతుంది. ఈ మూవీ రిలీజై ఏడాది అయిన సందర్భంగా ఆర్‌ఆర్‌ఆరా్ జపాన్ థయేటర్లో స్క్రీనింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ట్రిపుల్ ఆర్ స్క్రినింగ్ అవుతున్న థియేటర్ థియేటర్‌కల్లా వెళ్లి సందడి చేస్తున్నారు. ఇప్పటికే జక్కన్న జపాన్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీని మ్యూజికల్‌గా అరుదైన గౌరవం దక్కిందంటూ జక్కన్న ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "110 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన తకరాజుకా సంస్థ మా ఆర్‌ఆర్‌ఆర్‌ని (RRR Movie) మ్యూజికల్‌గా మార్చడం విశేషం. మా ఈ సినిమా మొత్తాన్ని మ్యూజికల్ బ్రాడ్‌వే నాటకంగా స్వీకరించిన జపనీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నా. షోలో పాల్గొన్న మహిళల శక్తి, ప్రతిభ, మెళకువలకు అభినందంచడానికి సరిపోయే పదాలు నాకు దొరకడం లేదు" అంటూ చివరిలో జపానీస్ భాషలో (అరిగాటో గోజైమాసు) వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ మూవీ జపాన్ ఈ రేంజ్‌లో వస్తున్న రెస్పాన్స్ చూసి తెలుగు ఆడియన్స్, ఇండస్ట్రీ అంతా మురిసిపోతున్నారు.
View this post on Instagram
Also Read: ఒకే స్టేజ్ పంచుకున్నా కనీసం చూసుకోని సమంత,నాగచైతన్య - మాజీ భర్తకు ఎదురుపడకుండా జాగ్రత్తపడ్డ సామ్
ఈసారి పాన్ వరల్డ్ సినిమాతో
SS Rajamouli and Mahesh Babu SSMB29: కాగా భారతదేశం గర్వించగ్గ దర్శకులలో జక్కన్నది మొదటి స్థానం అని చెప్పడం సందేహం లేదు. బాహుబలి 1, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ వైడ్ పరిచయం చేశారు. జక్కన దెబ్బకు టాలీవుడ్ క్రేజ్ ఇప్పుడు ఇంటర్నేషన్ వైడ్‌గా పాకింది. దీనికి ఇప్పుడు జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు వస్తున్న రెస్పాన్సే ఉదాహరణ. ఇదిలా ఉంటే రాజమౌళి ఈసారి పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించేందుకు ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టారు. ssmb29 అనే వర్కింగ్ టైటిల్ ఈ మూవీని ప్రకటించారు. ప్రస్తుతం పీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం జక్కన్న ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్ అయ్యాడు. ఫారిన్ వెళ్లిన తన ఫిట్‌నెస్, లుక్ విషయంలో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.