Samantha-Naga Chaitanya: ఒకే స్టేజ్ పంచుకున్నా కనీసం చూసుకోని సమంత,నాగచైతన్య - మాజీ భర్తకు ఎదురుపడకుండా జాగ్రత్తపడ్డ సామ్
Samantha-Naga Chaitanya: అమెజాన్ ఈవెంట్ సమంత నాగ చైతన్య ఎదురుపడకుండ జాగ్రత్త పడ్డారట. మాజీ భర్త చైకి కనీసం ఎదురపడకుండ ఈవెంట్ షెడ్యూల్‌ని స్పెషల్‌గా ప్లాన్ చేసుకుందట.
Samantha and Naga Chaitanya No Connection at Amazon Event: విడాకులు తర్వాత మాజీ దంపతులు సమంత-నాగ చైతన్య తొలిసారి ఒకే ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైం కార్యక్రమంలో తమ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌కు కోసం వీరద్దరు హాజరైన సంగతి తెలిసిందే. ఒకే ఈవెంట్‌కు ఒకేసారి ఈ మాజీ దంపతులు హాజరవడంతో ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగితేలారు. ఏదోక టైం అయినా వారు ఒకరినోకరు చూసుకోకపోతారా? ఆ వీడియో బయటకు రాకపోతుందా? అని ఎదురుచూశారు.
ఇప్పటికీ అలాంటి వీడియో ఏదైనా వస్తుందామే అని వారి ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఈ ఎక్స్ కపుల్స్ ఫ్యాన్స్‌కి ఏ ఒక్క చాన్స్ కూడా ఇవ్వలేదట. ఒకే వేదికను పంచుకున్న వీరిద్దరు కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చుకోలేదని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో మొదట సమంత తన సిటాడెల్ యాక్షన్ సిరీస్ టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం వరుణ్ ధావన్‌తో కలిసి పంచుకుంది. స్టేజ్‌పైకి వచ్చిన సమంత కనీసం తల కూడా పైకి ఎత్తలేదు. కిందకు దిచ్చుకునే తన సిటాడెల్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌లో పాల్గొంది. అప్పుడు అక్కడే ఉన్న నాగ చైతన్య కూడా కనీసం స్టేజ్‌వైపు తలెత్తి కూడా చూడలేదట.
View this post on Instagram
సమంత స్టేజ్‌పై ఉన్నంత సేపు చై కనీసం ఆ వైపు కూడా చూడకుండా ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక సమంత తన ప్రమోషన్ అయిపోగానే అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయిందట. ఆ తర్వాత నాగచైతన్య తన ధూత వెబ్ సిరీస్ కోసం స్టేజ్ ఎక్కాడు. ఇక తన ప్రమోషన్ కూడా అయిపోయాగానే తిరిగి వచ్చేశాడట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈవెంట్ కు హజరవుతున్న వారు ముందుగానే గట్టి ప్లాన్ చేసుకున్నారట. ఈవెంట్ లో ఎక్కడా కూడా ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారట. తన టీం, ఈవెంట్ నిర్వాహకులకు మరి మరీ చెప్పారట. సామ్ అయితే తన టీంతో ఈవెంట్ షెడ్యూల్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుందట.
Also Read: మయోసైటిస్‌తోనే సిటాడెల్ షూటింగ్ - చాలా కష్టంగా గడించింది, యాక్షన్ సీన్స్‌లో మూర్చపోయా
దాని ప్రకారం ఆమె ఈవెంట్ హాజరై పని అయిపోయాగానే అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ఇది తెలిసి వీరి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. విడాకుల ప్రకటించిన మూడేళ్లు గడిచిన ఈ ఇద్దరు ఎప్పుడు ఎక్కడ కూడా ఎదురుపడలేదు. టాలీవుడ్‌లో జరిగే ఎలాంటి ఈవెంట్ అయినా దానికి వీరిద్దరు దూరంగానే ఉన్నారు. ఇంతకాలం ఒకరినొకరు నేరుగా కలవకుండ, చూసుకోకుండా జాగ్రాత్త పడ్డ వీరిద్దరు ఫస్ట్ ఒకే ఈవెంట్‌కు ఒకే టైంలో హాజరయ్యారు. కానీ ఇక్కడ కూడా వారిద్దరు కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చుకోకుండా జాగ్రత్త పడి అభిమానులను నిరాశపరిచారు.