Suriya: సూర్య, దీపికాతో తీయాలనుకున్న సినిమా... ఆఖరికి కొత్త వాళ్ళతో తీశారు, రిజల్ట్ చూస్తే?
Deepika Padukone: సూర్య, దీపికా పదుకోన్ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే వీళ్లిద్దరితో సినిమా ప్లాన్ చేశాడు ఓ యువ దర్శకుడు. ఆఖరికి ఆ సినిమాను కొత్త వాళ్ళతో తీశారు. రిజల్ట్ ఏమైందంటే?

సూర్య (Suriya Sivakumar) కోలీవుడ్ కథానాయకుడు. అయితే ఆయనకు బాలీవుడ్ ప్రేక్షకులనూ ఫాలోయింగ్ ఉంది. దీపికా పదుకోన్ (Deepika Padukone) బాలీవుడ్ భామ. బెంగళూరులో జన్మించినప్పటికీ హిందీ సినిమాలతో దక్షిణాదిలో పేరు, గుర్తింపు తెచ్చుకుంది. వీళ్ళిద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు సూర్య, దీపిక కలిసి సినిమా చేయలేదు. ఈ జంటతో తెలుగు దర్శకుడు ఒక సినిమా ప్లాన్ చేశారు. అయితే ఆఖరికి కొత్త వాళ్లతో చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? ఆ దర్శకుడు ఎవరో తెలుసా?
అనంతిక... హను... రవి కాదు...
దర్శకుడి ఫస్ట్ ఛాయిస్ సూర్య, దీపిక!
'మధురం', 'మను' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫీచర్ ఫిలిమ్ '8 వసంతాలు'. ఇందులో 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్ర చేశారు. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి హీరోలుగా నటించారు.
'8 వసంతాలు' సినిమాను దీపికా పదుకోన్, సూర్యతో చేయాలని ప్లాన్ చేశానని అయితే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సలహా వల్ల కొత్త వాళ్లతో చేయాల్సి వచ్చిందని దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అది అసలు సంగతి.
సూర్య, దీపిక నటిస్తే ఈ సినిమా ఎలా ఉండేదో? ఒక్కటి మాత్రం నిజం... వాళ్ళిద్దరూ జంటగా నటిస్తే సినిమాకు వచ్చే క్రేజ్ వేరు. ఇప్పుడు కూడా '8 వసంతాలు'కు తక్కువ ప్రచారం ఏమీ లభించలేదు. సినిమా విడుదలకు ముందు కమర్షియల్ ఫిలిమ్స్ మీద దర్శకుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అదే విధంగా సినిమా చూడడానికి అర్హత ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల డిస్కషన్ నడిచింది.
ఫణీంద్ర నర్సెట్టి కామెంట్స్ పక్కన పెడితే... థియేటర్లలో విడుదలైన '8 వసంతాలు' సినిమాకు అద్భుతమైన స్పందన ఏమీ రాలేదు. బాక్స్ ఆఫీస్ పరంగా డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఆ లెక్కన చూస్తే సూర్య, దీపిక ఖాతాలో ఒకటి డిజాస్టర్ మిస్ అయిందని చెప్పుకోవాలి. భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి సినిమా ఏమైనా చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే అంతే!

'8 వసంతాలు' విడుదల తర్వాత ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో వారణాసిలో కథానాయికపై రేప్ అటెంప్ట్ చేసే యువకుడిని బ్రాహ్మణుడిగా చూపించడం సైతం విమర్శలకు దారి తీసింది. ఆ విమర్శలకు దర్శకుడు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. సీతాదేవిని అపహరించుకు వెళ్ళిన రావణుడు బ్రాహ్మణుడు కాదా? అని ఆయన ప్రశ్నించారు. కులమతాలను బట్టి కాదని, బుద్ధిని బట్టి నేరాలు చేస్తారని తెలిపారు. ఆ వివాదం సైతం సినిమాకు వసూళ్లు తీసుకు రాలేకపోయింది.
Also Read: ప్రభాస్ సినిమాతో తరుణ్ రీ ఎంట్రీ? ఆ న్యూస్ వెనుక అసలు కథ ఇదేనా?





















