The Raja Saab: ప్రభాస్ 'ది రాజా సాబ్' సీక్వెల్ - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మారుతి..
The Raja Saab Sequel: ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ టీజర్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక సినిమాపై అంచనాలు పదింతలు కాగా.. సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ మారుతి.

Director Maruthi Clarifies About The Raja Saab Sequel: చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూపించారు డైరెక్టర్ మారుతి. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' మూవీ టీజర్ ఆకట్టుకోగా.. సినిమా ఎవరి ఊహలకు అందదని మారుతి అన్నారు. ఈ మూవీ రన్ టైం, సీక్వెల్‌పై ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.
సీక్వెల్‌పై క్లారిటీ..
'ది రాజా సాబ్' మూవీకి సీక్వెల్ ఏమైనా ఉంటుందా?' అని ఎదురైన ప్రశ్నకు మారుతి స్పందించారు. పార్ట్ 2 కోసం బలవంతంగా స్టోరీని సాగదీసి రుద్దనని చెప్పారు. 'మూవీ పూర్తయ్యాక చూద్దాం. పార్ట్ 2 కోసం బలవంతంగా కథ సాగదీసి రుద్దను. దానిపై ఫుల్ క్లారిటీ మాకు ఉంది. నటీనటులకు 8 గంటల వర్క్ అనేది సాధారణం. కానీ ఈ మూవీ కోసం మేము 18 గంటలు వర్క్ చేశాం. అందుకే టీజర్ సహా ఇంత మంచి అవుట్ పుట్ వచ్చింది.' అని చెప్పారు.
'రాజా సాబ్' రన్ టైం ఎంతంటే?
ఈ మూవీ రన్ టైం 3 గంటలు ఉంటుందని మారుతి చెప్పారు. 'తమన్ అద్భుత మ్యూజిక్ అందిస్తున్నారు. అది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. హీరో ఎంట్రీ సాంగ్, ముగ్గురు హీరోయిన్స్‌తో మరో సాంగ్ అన్నీ డార్లింగ్ ఫ్యాన్స్‌తో సహా అంతా ఎంజాయ్ చేస్తారు. ఓ అభిమానిగా నా హీరోను ఎలా చూపించాలనుకున్నానో అలానే చూపించా. ప్రభాస్ ప్రత్యేక కామెడీ టైమింగ్‌ను పాన్ ఇండియా స్థాయిలో చూపించాలనుకున్నాం. స్టోరీకి అనుగుణంగా భారీ సెట్స్ వేశాం. హారర్ కామెడీ జానర్‌ను డిఫరెంట్‌గా ఈ స్టోరీ ఉంటుంది. ప్రభాస్‌కు నాపై ఉన్న నమ్మకంతో ఈ తరహా కథ చేశాను.' అని అన్నారు.
క్లైమాక్స్‌కు ఎలా ఉంటుందటే?
ఈ సినిమా షూటింగ్‌కు దాదాపు రెండున్నరేళ్లు పట్టిందని.. గతేడాదే కీలక షెడ్యూల్ షూట్ చేసినట్లు మారుతి తెలిపారు. దాదాపు 120 రోజులకు పైగా షెడ్యూల్‌లో టైంలోనే క్లైమాక్స్ చిత్రీకరించినట్లు చెప్పారు. 'దాదాపు 300 రోజులు వీఎఫ్ఎక్స్ కోసం కేటాయించాం. 40 మినిట్స్ క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. గతేడాది మా బ్యానర్‌లో కొన్ని మూవీస్ వచ్చినప్పటికీ క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ మూవీ క్వాలిటీ విషయంలో ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. ఇది మా బ్యానర్‌లోనే భారీ ప్రాజెక్ట్. సినిమాలో సంజయ్ దత్ రోల్ అద్భుతం.' అని వెల్లడించారు.
వింటేజ్ డార్లింగ్
టీజర్‌లో వింటేజ్ లుక్‌లో ప్రభాస్ గూస్ బంప్స్ తెప్పించారు. ఓ రాజ భవనంలో దాగి ఉన్న సంపద బ్యాక్ డ్రాప్.. హారర్, కామెడీ, లవ్ కలగలిపి మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















