Game Changer: 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఎప్పుడో చెప్పిన నిర్మాత 'దిల్' రాజు - పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
Game Changer Movie Release Date: నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడో రివీల్ చేశారు. తాజాగా రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మూవీ రిలీజ్ డేట్ చెప్పేశారు.
Dil Raju Announce Game Changer Movie Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రిలీజ్ అనంతరమే చరణ్ ఈ సినిమాకు సైన్ చేశాడు. షూటింగ్ కూడా మొదలై రెండేళ్లు అవుతుంది. కానీ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. స్లో స్లోగా ముందుకు వెళుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిలో దశలో ఉంది ఇంకా కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే ఉందని డైరెక్టర్ శంకర్ వెల్లడించారు.
అయితే గేమ్ ఛేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. ఇప్పటి వరకు మూవీకి సంబంధించిన ఎలాంటీ క్రేజీ అప్‌డేట్ రాలేదు. కనీసం రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమా సంబంధించిన ఏదైనా అప్‌డేట్ ఇవ్వండి అంటూ తరచూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డైరెక్టర్ శంకర్‌ని రిక్వెస్ట్ చేస్తుంటారు. కానీ మూవీ టీం నుంచి దీనిపూ ఎలాంంటి రెస్పాన్స్ రావడం లేదు. దీంతో గేమ్ ఛేంజర్ విషయంలో కాస్తా మూవీ టీంపై గుర్రుగా ఉన్నారు అభిమానులు. ఈ క్రమంలో వారందరికి సర్‌ప్రైజ్ ఇస్తూ నిర్మాత దిల్ రాజు క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెబుతూ ఫ్యాన్స్‌ని కూల్ చేశాడు.
View this post on Instagram
తాజాగా రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు గేమ్ ఛేంజర్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలోనే రిలీజ్ చేస్తామని, ఈ క్రిస్మస్‌కి మూవీ విడుదల తేదీ ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం చూస్తే క్రిస్మస్ కానుకగా సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేసేలా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్‌కి సంబంధించి ఆఫీషియల్‌గా ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా ఈ చిత్రం షూటింగ్ సెట్ నుంచి లీక్ అయ్యే షూటింగ్ సన్నివేశాలు, ఫోటోలు మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్.
Also Read: 'కల్కి 2898 ఏడీ' కమల్ పాత్ర రివీల్ - శ్రీకృష్ణుడి చీకటి కోణమే సుప్రీం యాస్కిన్..
రామ్ చరణ్ తల్లిదండ్రులుగా డ్యుయల్ రోల్ చేశాడని, అందులో ఓ పాత్ర ప్రభుత్వం అధికారిక కనిపంచనుందని ఇప్పటికే లీక్ అయిన విజువల్స్ ద్వారా అర్థమైపోతుంది. ఇటీవల గేమ్ ఛేంజర్ షూటింగ్ సెట్ నుంచి ఎయిర్‌పోర్టు సీన్ ఒకటి లీక్ అయ్యింది. చూస్తుంటే ఇది రామ్ చరణ్ విలన్‌కు మధ్య జరిగే ఓ కీలక సన్నివేశంగా అనిపించింది. . గేమ్ ఛేంజర్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో విలన్‌లు పోలిటిషయన్‌గా కనిపిస్తుండగా.. చరణ్ ప్రభుత్వ అధికారిగా సూటుబూటులో కనిపించాడు.