అన్వేషించండి

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Devara : ఎన్టీఆర్ 'దేవర' మూవీ టీజర్ ని ఈ నెలాఖరులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

NTR Devara Teaser Update : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా నుంచి త్వరలోనే టీజర్ రాబోతోందట. అది కూడా ఈ నెలలోనే అని సమాచారం. డీటెయిల్స్ లోకి వెళ్తే.. టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో 'దేవర' కూడా ఒకటి. 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి వీరిద్దరి కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా 'దేవర' రాబోతోంది.

అనౌన్స్మెంట్ తోనే ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో కొరటాల శివ ఈ మూవీని ప్లాన్ చేశారు. మొదటి భాగం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే చిత్ర టీజర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ టీం టీజర్ కట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 20 లోపు దేవర టీజర్ ని రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే ప్రభాస్ సలార్, షారుక్ ఖాన్ డంకీ సినిమాలకి దేవర టీజర్ ని అటాచ్ చేసి రిలీజ్ చేస్తారని అంటున్నారు. డంకీ, సలార్ సినిమాలకి దేవర టీజర్ ని అటాచ్ చేస్తే ఇండియా వైడ్ గా అన్ని భాషల ఆడియన్స్ కి మరింత రీచ్ అవుతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే టీజర్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ న్యూస్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ తండ్రి, కొడుకులు గా కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

సినిమాలో యాక్షన్ పార్ట్ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఈ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ పనిచేస్తున్నారు. రత్న వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ఆ రేప్ సీన్‌తో పోలిస్తే ఇదెంత - యానిమల్ ఇంటిమేట్ సీన్స్ పై తృప్తి దిమ్రీ షాకింగ్ కామెంట్స్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget