అన్వేషించండి

Tripti Dimri : ఆ రేప్ సీన్‌తో పోలిస్తే ఇదెంత - యానిమల్ ఇంటిమేట్ సీన్స్ పై తృప్తి దిమ్రీ షాకింగ్ కామెంట్స్?

Tripti Dimri : యానిమల్ మూవీలో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది తృప్తి దిమ్రీ.

Tripti Dimri About Animal Intimate scenes : 'యానిమల్'(Animal) మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నటి తృప్తి దిమ్రి(Tripti Dimri). సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ విజయాన్నిఅందుకుంది. ఈ సినిమాలో జోయా పాత్రలో తృప్తి దిమ్రి(Tripti Dimri) తన బోల్డ్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రణబీర్ తో ఈమె మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ షాక్ గురిచేసాయి. సినిమాలో తృప్తి ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ తో ఓ సీన్లో బెడ్ పై సెమీ న్యూడ్ గా కనిపించడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తృప్తి దిమ్రి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై స్పందించింది. "నిజానికి నెట్ ఫ్లిక్స్ మూవీ 'బుల్ బుల్'లో నేను చేసిన రేప్ సీన్‌తో పోలిస్తే ఇదేం పెద్ద కష్టం అనిపించలేదు. ఆ రేప్ సీన్ చేయడానికి సిద్ధపడడం నాకు సవాల్ గా అనిపించింది. కానీ ‘యానిమల్’లో అలాంటి సీన్స్ చేయడం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు" అంటూ చెప్పింది. అంతేకాకుండా యానిమల్ మూవీలో బోల్డ్ సీన్స్ చేసే రోజు షూటింగ్ ఎలా సాగిందో కూడా చెప్పుకొచ్చింది. "ఆరోజు నేను, రణబీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, సినిమాటోగ్రాఫర్ మాత్రమే సెట్ లో ఉన్నాం. ప్రతి ఐదు నిమిషాలకోసారి వాళ్లు బాగానే ఉన్నావా అని అడిగారు. ఏమైనా కావాలా అని అడిగారు. దీంతో నేను ఏమాత్రం అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు. కానీ రణబీర్ తో కలిసి నటించాలంటే మొదట్లో కొంత ఆందోళనకు గురయ్యాను" అని చెప్పింది.

ఇక సినిమాలో రణబీర్ తో ఓ సన్నివేశంలో అతని షూస్ నాకే సీన్ పై వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.. "అది నా యాక్టింగ్ కోచ్ నాకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. మన పాత్రను జడ్జ్ చేయకూడదు అన్నది గోల్డెన్ రూల్. మనం పోషించే పాత్రలు మన కోస్టార్స్ పోషించే పాత్రలు కూడా మనుషులే. మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. అన్ని పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే అదే మనసులో పెట్టుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది తృప్తి. దీంతో తృప్తి దిమ్రి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా ఈ సినిమాలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ తో పాటు మితిమీరిన వైలెన్స్ ఉందని ఎన్నో రకాల విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టడం పక్క అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సినీ యాక్టర్ అనిల్ కపూర్ తండ్రి పాత్రను పోషించారు. బాబీ డియోల్ విలన్ గా నటించారు.

Also Read : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Thaman Anirudh: బండోడి సంగీతంలో బక్కోడి పాట... ఇట్లు అర్జున కోసం అదరగొట్టారుగా!
బండోడి సంగీతంలో బక్కోడి పాట... ఇట్లు అర్జున కోసం అదరగొట్టారుగా!
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Irumudi Release: ఆగస్టులో 'ఇరుముడి' విడుదల... రవితేజ కమ్‌బ్యాక్ కన్ఫర్మ్?
ఆగస్టులో 'ఇరుముడి' విడుదల... రవితేజ కమ్‌బ్యాక్ కన్ఫర్మ్?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Embed widget