Devara OTT: దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
Devara OTT Release: 'దేవర' విడుదలకు ముందు ఓటీటీ విడుదల గురించి కొంత మంది ప్రేక్షకుల్లో డిస్కషన్ జరుగుతోంది. ఎన్ని రోజుల్లో ఓటీటీకి వస్తుందని చూసే జనాలు ఉన్నారు. అయితే, ఆ విషయంలో టీమ్ జాగ్రత్త పడింది.
దేవర (Devara Movie) సినిమా యూనిట్ తమకు థియేట్రికల్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అని భావించింది. అందుకని ఓటీటీ రిలీజ్ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో డిజిటల్ స్క్రీన్ మీద సినిమా చూడొచ్చని ఎవరైనా అనుకుంటే... అటువంటి వాళ్లకు షాక్ తప్పదు!
థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే!
ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న 'దేవర' సినిమా థియేటర్లలోకి వస్తుంది. అప్పటి నుంచి ఎనిమిది వారాల వ్యవధి తర్వాతే తమ చిత్రాన్ని ఓటీటీ వేదికకు ఇవ్వాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. సో... ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అయితే నవంబర్ నెలాఖరున విడుదల కావచ్చు. దీనివల్ల నిర్మాతలకు ఓ లాభం ఉంటుంది... థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది.
దళపతి విజయ్ టీం చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
తెలుగు సినిమాలకు ఇప్పుడు ఏపీ తెలంగాణ మార్కెట్ మాత్రమే కాదు... నార్త్ ఇండియా నుంచి కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. పైగా ట్రిపుల్ ఆర్ సినిమాతో అక్కడి ప్రేక్షకులకు ఎన్టీఆర్ దగ్గర అయ్యారు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే డిజిటల్ రిలీజ్ చేయాలనుకోవడం వల్ల నార్త్ ఇండియాలో ఎక్కువ స్క్రీన్లు 'దేవర' సినిమాకు లభిస్తాయి.
దళపతి విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'గోట్' సినిమాను థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు డిజిటల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందువల్ల నార్త్ ఇండియాలో పివిఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఆ సినిమాను బాయ్ కాట్ చేశాయి. ఉత్తరాదిలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలో వచ్చే సినిమాలకు ఎక్కువ స్క్రీన్లు ఇస్తున్నాయి. విజయ్ 'గోట్' టీం నాలుగు వారాలకు ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వడం వల్ల నార్త్ ఇండియాలో ఆ సినిమాకు మల్టీప్లెక్స్ స్క్రీన్లు లభించలేదు. ఇప్పుడు ఆ తప్పును ఎన్టీఆర్ టీం చేయలేదు. దాంతో ఓటీటీ నుంచి వచ్చే డబ్బుల కంటే థియేటర్ నుంచి ఎక్కువ రెవెన్యూ పొందే అవకాశం సొంతం చేసుకుంది.
Also Read: సారీ ప్రకాష్ రాజ్ గారూ... తెలుగులో విమర్శకుల ఛాన్స్ ఇవ్వని 'వేట్టైయాన్'
థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ మధ్య ఎన్ని వారాల వ్యవధి ఉండాలో నిర్ణయించే అధికారం దర్శక నిర్మాతలతో పాటు హీరో చేతిలో కూడా ఉంటుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటే నిర్మాతకు కాస్త ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తారు. అదే ఆ వ్యవధి పెరుగుతూ వెళితే నిర్మాతకు వచ్చే అమౌంట్ తగ్గుతుంది. కానీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు గాని ఓటీటీలో రాదని తెలిస్తే కుటుంబ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారు.