అన్వేషించండి

Vettaiyan Telugu Prevue: సారీ ప్రకాష్ రాజ్ గారూ... తెలుగులో విమర్శకులకు ఛాన్స్ ఇవ్వని 'వేట్టైయాన్'

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'వేట్టైయాన్'. తమిళ ప్రివ్యూ కొన్ని రోజుల కృతం విడుదలైంది. అక్కడ ఫీడ్ బ్యాక్ నేపథ్యంలో తెలుగుకు కరెక్షన్స్ చేశారు

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా తెరకెక్కిన తాజా సినిమా 'వేట్టైయాన్' (Vettaiyan Movie). ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్ర చేశారు. ఆయన పాత్రకు చెప్పించిన డబ్బింగ్ విమర్శలకు కారణం అయ్యింది. బహుశా... ఆ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారో? ఏమో? తెలుగుకు వచ్చే సరికి కరెక్షన్స్ చేశారు. 

సారీ ప్రకాష్ రాజ్ గారూ... మీ వాయిస్ లేదు!
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) క్యారెక్టర్ చెప్పే డైలాగుతో 'వేట్టైయాన్' తమిళ ప్రివ్యూ మొదలు అయ్యింది. అయితే... స్క్రీన్ మీద ఆయన ఫేస్ చూసి అక్కడి ఆడియన్స్ మాత్రమే కాదు, యావత్ భారతీయ ప్రేక్షకులు షాక్ అయ్యారు. అందుకు కారణం ఆయన ముఖానికి, వచ్చే మాటకు సంబంధం లేకపోవడమే. 

'వేట్టైయాన్' తమిళ ప్రివ్యూలో అమితాబ్ బచ్చన్ పాత్రకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పారు. అందువల్ల, ప్రివ్యూ మొదలైనప్పుడు ఆయన మాటలు విని, ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర చేశారని ఆడియన్స్ భావించారు. కానీ... స్క్రీన్ మీద అమితాబ్ ఫేస్, స్క్రీన్ వెనుక ప్రకాష్ రాజ్ డబ్బింగ్ అసలు సింక్ కాలేదు. అందుకని, అందరూ షాక్ తిన్నారు. 

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రకాష్ రాజ్ పాపులర్ ఆర్టిస్ట్. ఏ భాషలో సినిమా చేసినా సరే... డబ్బింగ్ చెప్పుకోవడం ఆయనకు అలవాటు. ఆ విలక్షణమైన గొంతు ఆడియన్స్ అందరికీ తెలుసు. అమితాబ్ బచ్చన్ గొంతు కూడా జనాలకు తెలుసు. దాంతో విమర్శలు వచ్చాయి. ఆ ఫీడ్ బ్యాక్ 'వేట్టైయాన్' ఫిల్మ్ మేకర్స్ దృష్టికి వెళ్లింది. తెలుగుకు వచ్చేసరికి ప్రకాష్ రాజ్ డబ్బింగ్ తీసేసి మరొకరితో డబ్బింగ్ చెప్పించారు.

ఇప్పుడు తమిళంలోనూ డబ్బింగ్ మార్చే ఆలోచన!
ప్రివ్యూ వరకు ప్రకాష్ రాజ్ వాయిస్ ఉన్నప్పటికీ... సినిమాలో అమితాబ్ పాత్రకు ఆ వాయిస్ ఉండదని సమాచారం అందుతోంది. ఏఐ సాయంతో మార్చే ఆలోచన చేస్తున్నారట. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో అమితాబ్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డైలాగులు చెప్పించి, ఆ తర్వాత ఏఐ సాయంతో గొంతును మార్చారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ టెక్నాలజీ సాయంతో అమితాబ్ పాత్రకు సినిమాలో కొత్త గొంతు వినిపించడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతోంది.

Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే


'వేట్టైయాన్'లో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా రజనీకాంత్!
Rajinikanth role in Vettaiyan: 'వేట్టైయాన్' సినిమాలో ఎటువంటి భయం లేకుండా నేరస్తులను ఎన్కౌంటర్ చేసే స్పెషలిస్టు పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు. 'మ‌న‌కు ఎస్పీ అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు' అని రజనీ పాత్రను ఉద్దేశిస్తూ ఓ డైలాగ్ రాశారు. వేట్టైయాన్ పేరు చెబితేనే రౌడీలు హ‌డ‌లిపోతుంటారు. రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే వారిని వేటాడే అధికారిగా హీరోని చూపించారు.

Also Readవిడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ... ఆమె భర్త గురించి తెల్సా? ఎవరీ మోసిన్?


'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థలో సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదల అవుతుంది. ఇందులో 'పుష్ప' ఫేమ్ ఫ‌హాద్ ఫాజిల్, 'రాయన్' ఫేమ్ దుసారా విజ‌య‌న్‌, ప్ర‌తినాయ‌కుడిగా రానా ద‌గ్గుబాటి, అభిరామి, మంజు వారియ‌ర్‌ కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Nara Lokesh: 'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Tanikella Bharani : పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
India vs Bangladesh 2nd Test: భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
Death Sentence: 21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
Embed widget