అన్వేషించండి

Murari Re Release: ‘మురారి’ చూస్తూ థియేటర్‌లోనే పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు అభిమాని - వీడియో వైరల్

Murari Re Release: మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా తను నటించిన ‘మురారి’ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అయ్యింది. ఈ రి రిలీజ్‌కు వెళ్లిన ఒక జంట.. థియేటర్‌లోనే పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Murari Re Release: సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి 12 గంటల నుండే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మొదలయ్యింది. ఈ హీరోకు అభిమానులంతా విష్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం పోస్టులతో నింపేశారు. అంతే కాకుండా ఇప్పట్లో మహేశ్ బాబు సినిమా ఏదీ థియేటర్లలో విడుదలకు అవకాశం లేదు. కానీ తన పాత సినిమాలు అయినా ‘మురారి’, ‘ఒక్కడు’ మాత్రం సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ అయ్యాయి. ఇక ‘మురారి’ సినిమాకు వెళ్లిన మహేశ్ బాబు ఫ్యాన్.. థియేటర్‌లోనే తన పార్ట్‌నర్‌ను పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సీరియస్‌గా తీసుకున్నాడు..

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘మురారి’ మూవీ రీ రిలీజ్ అని ప్రకటన రాగానే.. ఫ్యాన్స్ అంతా దీనికోసం ప్రిపరేషన్ మొదలుపెట్టారు. కొందరు ఫ్యాన్స్ అయితే అక్షింతలతో సిద్ధమయ్యారు. మరికొందరు అయితే థియేటర్‌లో ఎవరైనా అమ్మాయి నచ్చితే అక్కడే తాళి కట్టడానికి రెడీ అంటూ పసుపుతాడును కూడా సిద్ధం చేసుకొని సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు పెట్టారు. కానీ అదంతా కామెడీ అని నెటిజన్లు భావించారు. ఒక అభిమాని మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నాడు. అందుకే థియేటర్‌లో ‘మురారి’ సినిమాలోని పెళ్లి సాంగ్ ప్లే అవుతున్న సమయంలో అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు.

రీ రిలీజ్ ట్రెండ్..

రీ రిలీజ్ సినిమాలకు వచ్చి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడం, రీల్స్ చేయడం, అందరూ కలిసి పాటలు పాడడం చాలా కామన్. కానీ సినిమాకు వచ్చి థియేటర్‌లో పెళ్లి చేసుకోవడం వెరైటీ కాబట్టి ఆ థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులంతా ఈ జంటను వీడియో తీశారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరీ ‘మురారి’ సినిమాకు వచ్చి థియేటర్‌లోనే పెళ్లి చేసుకోవడం కొంచెం ఓవర్ అంటూ కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఇంట్లో చెప్పి వచ్చారా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికీ ఫేవరెట్..

2001లో విడుదలయిన ‘మురారి’ మూవీ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. ఇందులో మహేశ్ బాబు నటన, ఫ్యామిలీ ఎమోషన్స్.. చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే ఇలాంటి క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అనగానే మహేశ్ ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేశ్ బాబు, సోనాలి బింద్రే కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. మణిశర్మ అందించిన సంగీతంలో ఈ సినిమా పాటలను ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ వింటూనే ఉన్నారు. ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడు’ పాట ప్లే అవ్వకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ పెళ్లి జరగదు అన్నట్టుగా ఉంటుంది.

Also Read: నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్‌లు రాలేదు - సినిమా చెట్టుపై దర్శకుడు వంశీ వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget