అన్వేషించండి

Director Vamsy: నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్‌లు రాలేదు - సినిమా చెట్టుపై దర్శకుడు వంశీ వ్యాఖ్యలు

Director Vamsy: సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో సినిమా చెట్టు ఉంటుంది. తాజాగా ఈ చెట్టు కుప్పకూలిపోవడంతో దీనిని చూడడానికి వెళ్లారు వంశీ.

Director Vamsy About Cinema Chetty: సినిమా వారికి కొన్ని లొకేషన్స్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అందుకే కొందరు దర్శకులు తాము తెరకెక్కించే దాదాపు ప్రతీ సినిమాలో ఒక లొకేషన్‌ను రిపీట్ చేస్తుంటారు. అలా సీనియర్ డైరెక్టర్ వంశీకి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలోని సినిమా చెట్టుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 500 ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఈ చెట్టు తాజాగా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది అలనాటి మూవీ మేకర్స్.. ఈ విషయంపై స్పందిస్తూ సినిమా చెట్టుతో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దర్శకుడు వంశీ ఏకంగా ఆ సినిమా చెట్టు దగ్గరకు వచ్చి దాంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కచ్చితంగా చెట్టు ఉండాలి..

‘‘నా చిన్నప్పటి నుంచి సినిమా చెట్టు తెలుసు నాకు. ఏ వయసు నుంచి అంటే చెప్పలేను. నేను ఒక గుడికి వెళ్తున్నప్పుడు దారిలో ఈ చెట్టు కనిపించింది. తిరిగొచ్చేటప్పుడు చూద్దామని అనుకున్నాం. అది చలికాలం కావడంతో తిరిగొచ్చేటప్పటికి చాలా చలిగా ఉంది. ఈ చెట్టు పక్కనే ఒక మంట వెలుగుతుంది. చలికాచుకుందామని అనుకున్నాం. దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఒక శవం కాలుతుంది. కంగారుపడి తిరిగి వెళ్లిపోయాం. మొదటినుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడం కష్టం. గోదావరి ఒడ్డున నేను షూట్ చేస్తే కచ్చితంగా ఈ చెట్టుకు సంబంధించిన షాట్ ఉంటుంది’’ అని గుర్తుచేసుకున్నారు వంశీ.

మళ్లీ నిలబడాలి..

‘‘నేను కథలు రాస్తుంటాను. గోకులంలో రాధ అని ఒక నవల రాశాను. ఆ నవలలో ఈ చెట్టు, కుమారదేవ ఊరు చాలా ప్రధానం. అందులో హీరోయిన్‌ది ఈ ఊరు. అలా ఈ గోదావరితో ఎంత అనుబంధం ఉందో, ఈ చెట్టుతో అంతే అనుబంధం ఉంది. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్టు నిలబడాలి అన్నదే నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడానికి కారణం ఈ చెట్టే. ఇది మళ్లీ బ్రతకాలి, నిలబడాలి. ఈసారి నా సినిమాలో ఎక్కువశాతం ఇక్కడే తీయాలని నేను కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు వంశీ. సినిమా చెట్టు అక్కడ స్థానికులు చేయిస్తున్న పూజల్లో వంశీ కూడా పాల్గొని వారితో దీనిగురించి ముచ్చటించారు.

ఇక్కడే భోజనాలు..

‘‘ఈ చెట్టును నేను పూర్తిగా కవర్ చేశాను. నా సినిమాలో భానుప్రియాను చెట్టుపైకి ఎక్కించాను, దూకించాను. ఒక్క చిరంజీవితో తప్ప మిగిలిన అందరు యాక్టర్లతో ఇక్కడ సినిమాలు చేశాను. నా మొదటి సినిమా ‘మంచుపల్లకి’ హీరో ఆయనే. మొత్తం ఇక్కడ 18 సినిమాలు తీశాను. నేను తీసినంత ఎవరూ తీయలేదు. కృష్ణ నటించిన ‘పాడిపంటలు’తో ఫేమస్ అయ్యింది. రాఘవేంద్ర రావు ‘దేవత’ కూడా ఇక్కడే తీశారు. ఈ 3,4 రోజుల్లో ఈ చెట్టు కారణంగా ఊరు చాలా పాపులర్ అయ్యింది. నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్‌లె రాలేదు. ఇక్కడే కూర్చొని భోజనాలు చేసేవాళ్లం’’ అంటూ అక్కడ స్థానికులతో సినిమా చెట్టు జ్ఞాపకాల గురించి మాట్లాడారు వంశీ.

Also Read: సినిమా చెట్టు ఇక లేదు! 300కు పైగా సినిమా షూటింగ్స్ - నేలకొరిగిన మహావృక్షం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget