Telugu News: సినిమా చెట్టు ఇక లేదు! 300కు పైగా సినిమా షూటింగ్స్ - నేలకొరిగిన మహావృక్షం
Tree Collapse: 150 సంవత్సరాల వయస్సున్న ఆ చెట్టు కిందనే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, శ్రీదేవి, రాజేంద్రప్రసాద్ లాంటి నటీనటులు నటించారు. ఈ చెట్టును సినిమాలో చూపిస్తే హిట్ అనే నమ్మకం కూడా ఉండేది.
Movies Tree Collapse: 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్. 150 సంవత్సరాల వయస్సున్న ఈ చెట్టు చుట్టూ దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరగడం విశేషం. ఆ చెట్టు కిందనే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, శ్రీదేవి, రాజేంద్రప్రసాద్, తదితర అగ్ర నటీనటులు నటించారు. ఈ చెట్టును సినిమాలో చూపిస్తే హిట్ అనే నమ్మకం కూడా ఉండేది.
దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారు. ఆయన ప్రతి సినిమాలో దాదాపు ఏదో ఒక సీన్‌లో ఈ చెట్టు కనిపించేది. అంతటి పేరున్న ఈ చెట్టు కూలిపోయింది. దీంతో స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుందా? అనుకుంటున్నారా... తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉంది ఈ చెట్టు. దీంతో ఆ చెట్టుతో అనుబంధం ఉన్నవారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల కారణంగా చెరువు గట్టు బలహీనపడి ఆ చెట్టు కుప్పకూలినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
కుమారదేవం గ్రామంలో సుమారు 170 సంవత్సరాల క్రితం గ్రామ నివాసి సింగులూరి తాతయ్య దానిని నాటారు. ఆచెట్టు వలన రాష్ట్ర వ్యాప్తంగా కుమారదేవం గ్రామానికి పేరు వచ్చింది. ఈచెట్టు సినిమా చెట్టుగా పేరు గాంచింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని కొందరి సెంటిమెంటుగా ప్రసిద్ధి చెందినది. గతంలో పుష్కర గ్రాంటు వస్తే అరకొరగా పనులు చేసి నిర్లక్ష్యం చేయడం కారణంగానే చెట్టుకు ఈగతి పట్టినదని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏది ఏమైనా కుమారదేవం ఒక గొప్ప మణిహారాన్ని కోల్పోయిందని గ్రామస్థులు తెలిపారు.