అన్వేషించండి

Prudhvi Raj : న‌న్ను ఎవ్వ‌రూ అరెస్ట్ చేయ‌లేదు.. ఫ్యామిలీ విష‌యాల్ని బ‌జారుకి ఈడ్చ‌కండి: పృథ్వీరాజ్

Prudhvi Raj : న‌టుడు పృథ్వీ రాజ్ అరెస్ట్ అంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. త‌న‌ని ఎవ్వ‌రూ అరెస్ట్ చేయ‌లేద‌ని, ఇది కుటుంబ విష‌యం అని అన్నారు. ఏం జ‌రిగిందో వివ‌రిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

Prudhvi Raj Gives Clarity About His Arrest: సీనియ‌ర్ న‌టుడు పృథ్వీరాజ్ అరెస్ట్, ఆయ‌న‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ అంటూ వార్త వైర‌ల్ అయ్యింది. మొద‌టి భార్యకు భ‌ర‌ణం ఇవ్వ‌ని కేసులో ఆయ‌న్ను అరెస్ట్ చేశార‌ని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ రాశాయి. అయితే, ఆ వార్త‌ల‌పై స్పందించారు పృథ్వీ రాజ్. త‌న‌ని ఎవ్వ‌రూ అరెస్ట్ చేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు రాసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆ వీడియోలో చెప్పారు పృథ్వీ. ఇది కుటుంబ విష‌యం అని, తెల‌సుకోకుండా ఎందుకు అలా ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆయ‌న‌. భ‌ర‌ణం ఇవ్వాల్సిన దాంట్లో ఇప్ప‌టివ‌ర‌కు రూపాయి కూడా ఆప‌లేద‌ని చెప్పారు. 

పృథ్వీరాజ్ ఏమ‌న్నారంటే? 

‘‘అంద‌రికీ న‌మ‌స్కారం.. పృథ్వీరాజ్ అరెస్ట్, ఆయ‌నపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. కోర్టులో లొంగిపొమ్మ‌న్నారు, తీసుకెళ్లి విచారిస్తున్నారు అంటూ వార్త‌లు రాశారు. మొద‌టి భార్య‌కి భ‌ర‌ణం క‌ట్ట‌డం లేదు. ఆమెకు బాకీ ఉన్నాడు. అందుకే కోర్టు అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది అని ప్ర‌చారం చేశారు. అస‌లు విష‌యం తెలుసుకోకుండా ఎందుకు అలా రాస్తారు? ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు పృథ్వీ గారు ఏం జ‌రిగింది అని అడిగితే.. నేనే చెప్పేవాడిని క‌దా? ఎందుకు అలా తెలుసుకోకుండా రాస్తున్నారు? న్యాయస్థానం ప‌రిధిలో, ఫ్యామిలీ కోర్టులో ఈ ఇష్యూ చాలా ఏళ్ల నుంచి న‌డుస్తుంది. దాంట్లో భాగంగా వాళ్లు ఒక అమౌంట్ చెప్పారు. ప్ర‌తి నెల ప‌దో తారీఖున డ‌బ్బులు పంపాలి. పంపిస్తున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి నెల అకౌంట్ నుంచి అటోమెటిక్ గా క‌ట్ అవుతుంది. పృథ్వీ రాజు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు విష‌యం మీరు తెలుసుకోవాలి క‌దా? ఏది ప‌డితే అది రాయొద్దు ద‌య‌చేసి’’ అని అన్నారు.

చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు.. 

‘‘ఈ విష‌యంపై నా లాయ‌ర్స్ ని కూడా క‌నుకున్నాను. వాళ్లే ఆశ్చ‌ర్య‌పోయారు. ఏంటిది ఏమీ లేకుండా ఇలా ఎలా వ‌చ్చింది? అస‌లు విష‌యం తెలుసుకోకుండా ఎలా రాస్తారు? అని అన్నారు. నా గురించి ఎవ‌రైతే త‌ప్పుడు వార్త‌లు రాశారో వాళ్ల‌పైన చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాను. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విష‌యం కోర్టులో ఉంది. ఫ్యామిలీ విష‌యం. దాన్ని కూడా బ‌జారుకు ఈడుస్తారా? భ‌ర‌ణం ఎంత క‌ట్టాలి? ఎంత క‌డుతున్నాను అవి కోర్టుకు తెలుసు. కోర్టు కూడా మీరేనా? ఒక మ‌నిషి క్యారెక్ట‌ర్ ని దిగ‌జార్చేలా చేయ‌కండి, రాయకండి. న్యాయ‌ప‌రంగా కోర్టు ఎంత క‌ట్ట‌మందో అంత క‌ట్టేస్తున్నాను. జూన్ నెల‌ది కూడా క‌ట్టేశాను. నిజ‌నిజాలు తెలుసుకుని మాట్లాడండి. ఇంత కంటే ఎక్కువ మాట్లాడ‌ను. అంద‌రూ నాకు మిత్రులు. ఏదైనా రాసేముందు అడ‌గండి. నేను క‌చ్చితంగా క్లారిటీ ఇస్తాను. మా లాయ‌ర్ల‌తో మాట్లాడి ఎవ‌రిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాను అని వివ‌ర‌ణ ఇచ్చారు పృథ్వీరాజ్.   

Also Read: మహారాజ రివ్యూ: తమిళంలో బ్లాక్ బస్టర్ రిపోర్ట్, మరి తెలుగులో? - విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget