అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CM Tollywood Meet : సీఎం జగన్‌తో టాలీవుడ్ భేటీ సర్వం సిద్ధం - సమస్యకు పరిష్కారం ఖాయమే !

గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు టాలీవుడ్ ప్రముఖులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి కీలకమైన అంశాలన్నింటిలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  గురువారం ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే రెండు సార్లు మంత్రి పేర్ని సీఎం జగన్‌ను కలిసి వివరించారు. సినిమా టికెట్ల పై ప్రభుత్వ కమిటీ  ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిపై సీఎం జగన్ సినీ ప్రముఖులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

టిక్కెట్ రేట్లు పెంచాలని కమిటీ నివేదిక  !

సినిమా టిక్కెట్ ధరలపై హైకోర్టు సూచనలతో ప్రభుత్వం నియమించిన కమిటీ పేర్ని నానికి నివేదిక సమర్పించారు. టికెట్ ధరలు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే మల్టీప్లెక్స్‌ టికెట్ల రేట్లలో పెద్దగా మార్పులు లేవు. కానీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు మాత్రం పెంచాలని సూచించారు. ఏ ప్రాంతం అయినా సరే, నాన్‌ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర రూ. 30  ఉండాలని సిఫారసు చేశారు.  జీవో నెంబర్ 35 ప్రకారం అది కేవలం 5 రూపాయలే ఉంది.  అంటే ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ప్రకారం 25రూపాయలు అదనం అవ్వబోతోంది. అలాగే నాన్‌ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను  రూ. 70 కు రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని సీఎం జగన్ పరిశీలించాల్సి ఉంది. 

టాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు !?

చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం జగన్‌తో ఎవరెవరు భేటీ అవబోతున్నారన్న అంశం ఇంకా ఫైనల్ కాలేదు. అయితే  ఈ స‌మావేశంలో చిరంజీవితో పాటుగా నాగార్జున‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోలూ పాల్గొనబోతున్నార‌ని తెలుస్తోంది. టికెట్ రేట్లు త‌గ్గిస్తూ.. ఏపీ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేయ‌డంతో స‌మ‌స్య మొద‌లైంది. ఇప్పుడు ఆ జీవోని సవ‌రించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రభుత్వం వద్ద రెడీగా ఉంది. నటులే కాకుండా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరవుతారని భావిస్తున్నారు. 

టిక్కెట్ రేట్లు కాదు ఆన్ లైన్ టిక్కెట్లే సమస్య అన్న తమ్మారెడ్డి భరద్వాజ !

జగన్‌తో టాలీవుడ్ బృందం భేటీ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడారు.  ప్రైవేట్ ఆన్ లైన్ టికెటింగ్ ప్రదాన సమస్య.. ప్రభుత్వం, ఛాంబర్ కలిసి అన్ లైన్ వ్యవస్ద  పెట్టాలన్నది మా ఆలోచన అని వివరించారు.  టికెట్ రేట్లు తెలంగాణ లో పెంచారు. తగ్గించటం లేదు.  దాని వల్ల ఇక్కడ సినిమాలను చూడటం తగ్గించారు. ఆంధ్రాలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువగా చూశారని విశఅలేషించారు.  5 వ ఆట పెడితే చిన్న సినిమాలకు ఉపయోగకరంగా ఉంటుందని అడుగుతామన్నారు.  ఆంధ్ర ,తెలంగాణ ప్రభుత్వాలను సబ్సిడిలను అడుగుతున్నాము. ప్రభుత్వం తరపున మాట్లాడేందుకు ఛాంబర్ ఉందని ఏదైనా ఇండస్ట్రీ మంచి  కోసమేనని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget