Box Office Collection: క్రిస్మస్ బాక్సాఫీస్ వార్... ఆరింటిలో ఏ సినిమా కలెక్షన్స్ ఎంత? ఏ మూవీకి ఎక్కువ?
Dec 25 Telugu Movie Releases - Collections: క్రిస్మస్ సందర్భంగా తెలుగులో ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏ సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చింది? దేనికి ఎక్కువ? దేనికి తక్కువ? అనేది చూస్తే...

క్రిస్మస్ బరిలో బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు మార్కెట్ విషయానికి వస్తే... ఆరు సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడ్డాయి. అందులో ఏ సినిమా కలెక్షన్ ఎంత? దేనికి ఎక్కువ వచ్చాయి? దేనికి తక్కువ వచ్చాయి? అనేది చూస్తే...
రోషన్ మేక, అనస్వర రాజన్ జంటగా నటించిన 'ఛాంపియన్'కు ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ప్రచారం చేశారు. అయితే సోషల్ మీడియా లేదంటే నేరుగా సినిమా గురించి చెప్పారు. విడుదలకు ముందు 'గిర్రా గిర్రా...' సాంగ్ కూడా హిట్ అయ్యింది. సుమారు 30 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2.75 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది.
Also Read: 'ఛాంపియన్' రివ్యూ: బైరాన్‌పల్లి తిరుగుబాటులో ఫుట్‌బాలర్... రోషన్ సినిమా ఎలా ఉందంటే?
'బన్నీ' వాసు, వంశీ నందిపాటి విడుదల చేయడం వల్ల 'ఈషా'కు మంచి ప్రచారం దక్కింది. హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్, 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. దీనికి మొదటి రోజు 1.65 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'వృషభ'కు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కేవలం 70 లక్షల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసి... మోహన్ లాల్ కెరీర్ లోయస్ట్ ఓపెనింగ్ రికార్డు నమోదు చేసింది.
'శంబాల'తో ఆది సాయికుమార్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్ లభించింది. ఆల్మోస్ట్ కొట్టిన్నర నెట్ కలెక్ట్ చేసింది. రీసెంట్ టైమ్స్‌లో ఆది కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇదని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
మహిళల వస్త్రాలంకరణపై శివాజీ చేసిన కామెంట్స్ వల్ల 'దండోరా'కు కాస్త ఎక్కువ ప్రచారం వచ్చింది. అయితే ఆ స్థాయిలో సినిమా థియేటర్లు లేవు. అయితే పడిన షోస్ చాలా వరకు నిండుగా కనిపించాయి. నవదీప్, నందు, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి రోజు 22 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది.
'పతంగ్' సినిమాను లిమిటెడ్ రిలీజ్ చేశారు. ఇన్ని సినిమాల మధ్యలో ఆ మూవీకి తక్కువ థియేటర్లు వచ్చాయి. పదుల సంఖ్యలో మాత్రమే లభించాయి. అయితే రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో మ్యాగ్జిమమ్ హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఫస్ట్ డే ఆల్మోస్ట్ పది కోట్లు కలెక్ట్ చేసిందని తెలిసింది.





















