అన్వేషించండి

Shambhala Movie Review - 'శంబాల' రివ్యూ: శాస్త్రాలు vs సైన్స్... ఆది సాయి కుమార్ సినిమా హిట్టా? ఫట్టా?

Shambhala Review In Telugu: ఆది సాయికుమార్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్'. డిసెంబర్ 25న సినిమా విడుదల. దీనిపై ఆది చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి సినిమా ఎలా ఉందంటే?

Aadi Saikumar Shambhala Movie 2025 Review In Telugu: ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్'. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకుడు. ఇందులో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ ఇతర ప్రధాన తారాగణం. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శాస్త్రాల వర్సెస్ సైన్స్ నేపథ్యంలో వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగించాయి. మరి సినిమా ఎలా ఉంది?

కథ (Shambhala Movie Story): విశ్వం నుంచి శంబాల గ్రామంలో ఒక ఉల్క వచ్చి పడుతుంది. ఆ ఉల్కను బండ భూతం అని పిలుస్తారు గ్రామస్తులు. ఊరిలో ఆవు పాలకు బదులు రక్తం ఇవ్వడంతో దాన్ని చంపేయమని స్వామిజీ చెబుతారు. కానీ అలా జరగలేదు. ఊరిలో ఉల్కను పరీక్షించడానికి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ సైంటిస్ట్ విక్రమ్ (ఆది సాయికుమార్) గోవధను అడ్డుకుంటాడు. అప్పట్నుంచి ఆ ఊరిలో కొన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయి.

శాస్త్రాన్ని విక్రమ్ నమ్మడు. శంబాల ప్రజలది మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తాడు. ఊరిలో ఒకరి తర్వాత మరొకరు పిచ్చి పట్టినట్టు ప్రవరిస్తూ ఇతరుల ప్రాణాల్ని తీస్తుంటే... ఓ దశలో విక్రమ్‌ను చంపడానికి ప్రయత్నిస్తారు కొందరు. ప్రజల వ్యతిరేకతను తట్టుకుని, తన ప్రాణాలు కాపాడుకుని విక్రమ్ ఏం చేశాడు? ఆ ఊరిలో ఏం జరిగింది? విక్రమ్ పరిశోధనలో తేలింది ఏమిటి? శాస్త్రం నిజమా? సైన్స్ నిజమా? అనేది సినిమా.

విశ్లేషణ (Shambhala Review Telugu): దేవుడు వర్సెస్ దెయ్యం, శాస్త్రం వర్సెస్ సైన్స్ నేపథ్యంలో సినిమాలు తెలుగుకు కొత్త కాదు. అయితే ఇప్పటి వరకు మనం చూడని కొత్త కథను తెరపై చూడబోతున్నామని మొదటి నుంచి చివరి వరకు ఓ ఉత్కంఠ కలిగించిన సినిమా 'శంబాల'. ఎటువంటి కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ మీద నడిచిన సినిమా 'శంబాల'.

'శంబాల' సినిమాలో కాస్త 'విరూపాక్ష' ఛాయలు కనిపిస్తాయి. అలాగని రెండిటి మధ్య పోలికలు లేవు. కానీ, మరణాలు సంభవించే అంశంలో సారూప్యత ఉంది. బడ్జెట్ లిమిటేషన్ వల్ల వీఎఫ్ఎక్స్, ఒకరిద్దరు ఆర్టిస్టుల ఎంపికలో క్వాలిటీ లోపించింది. అయితే వ్యూయర్ ఎక్స్‌పీరియన్స్‌ను పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. మెయిన్ ట్విస్ట్, రెండు మూడు టర్న్‌లు ఊహించదగినవే అయినప్పటికీ... ప్రతి 15 - 20 నిమిషాలకు థ్రిల్ ఇవ్వడంలో దర్శకుడు యుగంధర్ ముని సక్సెస్ అయ్యారు. 

'శంబాల'కు తెరపై హీరో ఆది సాయికుమార్ అయితే... తెర వెనుక హీరో దర్శకుడు యుగంధర్ ముని. క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఆది నటించారు. ఫైట్స్ కథలో భాగంగా వచ్చాయి. కమర్షియాలిటీ కోసమని, హీరోయిజం చూపించాలని ఆది ట్రై చేయలేదు. నటుడిగా ఆయన ట్యాలెంట్ గురించి తెలిసిందే. ప్రతి సన్నివేశంలో కంటెంట్‌కు తగ్గట్టు ఎమోషన్ పలికించారు. ముఖ్యంగా చిన్న పాపను ఊరి ప్రజలు అందరూ కలిసి బలి ఇవ్వాలని ట్రై చేసినప్పుడు... కంటతడి పెట్టే సీన్ నటుడిగా మరోసారి ఆది ప్రతిభను చాటింది. ఇటువంటి కథకు భారీ బడ్జెట్ అవసరం. హీరో మార్కెట్ మించి నిర్మాతలు ఖర్చు చేసినా... లార్జ్ స్పాన్ ఉన్న కథకు అది చాలదు. ఇక్కడ దర్శకుడు తెలివితేటలు చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ పరంగా చేసిన వర్క్ తెరపై కనిపించింది. ప్రేక్షకుల్ని 1980ల కాలంలోకి తీసుకు వెళ్లడంలో లొకేషన్స్, కాస్ట్యూమ్స్ హెల్ప్ తీసుకున్నారు. బలమైన సన్నివేశాలు కొన్ని రాసుకున్నారు. సైన్స్ కాదని శాస్త్రం వైపు మొగ్గు చూపడం కొంత మందికి నచ్చకపోవచ్చు. 

Also Read: Vrusshabha Movie Review - 'వృషభ' రివ్యూ: 'మగధీర' లాంటి కథతో మోహన్ లాల్ సినిమా... పునర్జన్మల కాన్సెప్ట్‌తో హిట్ వచ్చేనా?

యుగంధర్ ముని కథలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. కానీ వెళ్లిన తర్వాత క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు. అందువల్ల, ఫస్టాఫ్ స్లోగా సాగిన ఫీల్ ఇస్తుంది. కొన్ని సీన్స్ సిల్లీగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు మళ్ళీ స్పీడ్ అందుకుంది. ఆ తర్వాత సెకండాఫ్ రేసీగా సాగింది. క్లైమాక్స్ సింపుల్‌గా, ప్రెడిక్టబుల్‌గా సాగింది. ఈ కథ, సన్నివేశాలకు శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా బావున్నాయి.

'శంబాల'లో అర్చనా అయ్యర్ హీరోయిన్ అని చెప్పలేం. కథలో ఆమెది కీలకమైన పాత్ర. ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు నమ్మేలా అర్చన లుక్, గెటప్ ఉన్నాయి. ఆది సాయికుమార్ వెన్నంటి ఉండే పాత్రలో మధునందన్ చక్కగా నటించారు. అయితే... ఇంద్రనీల్ సీన్స్ సర్‌ప్రైజ్ చేస్తాయి. ఆయన కటౌట్ వల్ల ఆ సీన్స్ చూసినప్పుడు నమ్మేస్తాం. రవివర్మ నటన 'వావ్' అనేలా ఉంది. ఆయన విజృంభించారు. పల్లెటూరి మహిళ పాత్రలో శ్వాసిక విజయ్ చేత గ్లామర్ షో చేయించారు. కథకు అవసరం లేదేమో!? లక్ష్మణ్ మీసాల మరోసారి 'మంగళవారం' తరహాలో ఆకట్టుకుంటారు.

బలమైన కథ, సన్నివేశాలతో తెరకెక్కిన సినిమా 'శంబాల'. మధ్య మధ్యలో కొన్ని అప్ అండ్ డౌన్స్‌ ఉన్నప్పటికీ... స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేస్తుందీ సినిమా. ఆది సాయికుమార్ రీసెంట్ సినిమాల్లో 100% బెస్ట్ ప్రొడక్ట్. ఆయన కూడా కథను దాటి బయటకు వెళ్లకుండా మంచి నటన కనబరిచారు. ఇందులో మంచి థ్రిల్స్ ఉన్నాయి. కథలో నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా విక్రమ్ ప్రయాణం ఎలా సాగిందో... 'శంబాల'తో పరాజయాల నుంచి విజయం వైపు ఆది అడుగు పడిందని చెప్పవచ్చు.

Also ReadAlso Read'ఛాంపియన్' రివ్యూ: బైరాన్‌పల్లి తిరుగుబాటులో ఫుట్‌బాలర్... రోషన్ సినిమా ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget