అన్వేషించండి

Champion Movie Review - 'ఛాంపియన్' రివ్యూ: బైరాన్‌పల్లి తిరుగుబాటులో ఫుట్‌బాలర్... రోషన్ సినిమా ఎలా ఉందంటే?

Champion 2025 Review In Telugu: శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణలోని బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Roshan Meka and Anaswara Rajan's Champion 2025 Movie Review In Telugu: శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించిన తాజా సినిమా 'ఛాంపియన్'. మలయాళ భామ అనస్వర రాజన్ తెలుగు కథానాయికగా పరిచయమైన చిత్రమిది. దీనితో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ గడ్డపై బైరాన్‌పల్లి తిరుబాటు నేపథ్యంలో ఒక ఫిక్షనల్ కథతో ఈ సినిమా రూపొందింది. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Champion Movie Story): మైఖేల్ (రోషన్ మేక) ఫుట్ బాల్ ప్లేయర్. ఇంగ్లాండ్ వెళ్లి సెటిల్ అవ్వాలనేది అతని కల. వెళ్లే అవకాశం వస్తుంది. కానీ, ఓ చిక్కు వచ్చి పడుతుంది. దాన్ని తప్పించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో బైరాన్ పల్లి వెళ్లి కొన్ని రోజులు తల దాచుకోవాలసి వస్తుంది. 

బైరాన్ పల్లిలో చంద్రకళ (అనస్వర రాజన్)తో పరిచయం, నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు మైఖేల్‌లో ఎటువంటి మార్పు తీసుకు వచ్చాయి? బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏమిటి? ఇంగ్లాండ్ వెళ్లాల్సిన మైఖేల్... బైరాన్ పల్లి కోసం ఏం చేశాడు? అనేది సినిమా.    

విశ్లేషణ (Champion Movie 2025 Review In Telugu): హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ తీసుకుని ఫిక్షనల్ క్యారెక్టర్లతో పీరియాడిక్ సినిమాలు తీయడం నయా ట్రెండ్. 'ఛాంపియన్' కూడా ఆ జాబితాలో చిత్రమే. అయితే... ఇక్కడ చరిత్రను మార్చి తీయడం అంగీకరించే విధంగా లేదు. భారత స్వాతంత్ర ఉద్యమంలో హైదరాబాద్ సంస్థానం విలీనం వెనుక, రజాకార్ల మీద తిరుగుబాటు వెనుక బోలెడు కథలు ఉన్నాయి. అటువంటి ఓ కథను సమూలంగా మార్చడం హర్షించేలా లేదు. పోనీ అది పక్కన పెట్టినా... స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేయడంలో సక్సెస్ కాలేదు.

'ఛాంపియన్' ప్రారంభమే నిస్సారంగా మొదలైంది. 'ఆపరేషన్ పోలో'కి దారి తీసిన పరిస్థితులు ప్రజలకు తెలుసు. చరిత్రలో ఉంది. ఆ సన్నివేశాలతో సినిమా స్టార్ట్ చేయడం వల్ల అంత ఆసక్తి కలగలదు. అయితే రోషన్ పరిచయం, 'వెన్నెల' కిశోర్ - కోవై సరళతో సన్నివేశాలతో కాస్త ఆసక్తి కలుగుతుంది. అయితే... ప్రతిదీ నిదానంగా సాగుతుంది. కథలో కాన్‌ఫ్లిక్ట్‌ కరెక్టుగా వర్కవుట్ కాలేదు. అయితే ప్రేమ కథ లేదంటే పోరాట కథ... రెండిటిలోనూ ఏదీ కనెక్ట్ అయ్యేలా లేదు. సినిమా మొదలైన గంటకు గానీ హీరోయిన్ అనస్వర రాజన్ తెరపైకి రాలేదు. ఆ తర్వాత కథలో జీవం మొదలు అయ్యింది. 'గిర్రా గిర్రా...' పాట బావుంది. మళ్ళీ సినిమాలో నీరసం మొదలైంది.

రోషన్, అనస్వర రాజన్ ప్రేమ కథలోనూ డెప్త్ లేదు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్రను ప్రారంభంలో శక్తివంతంగా చూపించారు. అయితే... ఆ తర్వాత ఆ స్థాయి సన్నివేశాలు రాలేదు. కథ, సన్నివేశాలు, మాటల్లో అసలు డెప్త్ లేదు. అందువల్ల ఏ దశలోనూ కనెక్ట్ అవ్వదీ సినిమా. రచన, దర్శకత్వంలో లోపాలు ఉన్నప్పటికీ... ప్రదీప్ అద్వైతానికి సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడి నుంచి మంచి మద్దతు లభించింది. మిక్కీ జే మేయర్ అందించిన పాటల్లో 'గిర్రా గిర్రా' బావుంది. హీరో హీరోయిన్లు దూరమయ్యేటప్పుడు వచ్చే 'కలలా...' పాట కూడా. నేపథ్య సంగీతం ఓకే. మది సినిమాటోగ్రఫీ వల్ల సినిమాకు హిస్టారికల్ లుక్ వచ్చింది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. భారీగా తీశారు. అయితే వీఎఫ్ఎక్స్ విషయంలో కేర్ తీసుకోలేదు. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ బాలేదు.

Also ReadDhandoraa Movie Review - 'దండోరా' రివ్యూ: ప్రేమ, చావు మధ్యలో కుల వివక్ష కుంపటి... శివాజీ కొత్త సినిమా ఎలా ఉందంటే?

రోషన్ మేక, అనస్వర రాజన్...'ఛాంపియన్'లో అసలు సిసలైన ఛాంపియన్లు వీళ్ళు. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బావుంది. రోషన్ హ్యాండ్సమ్ లుక్స్ ఈ సినిమా మెయిన్ హైలైట్స్‌లో ఒకటి. నటన కూడా బావుంది. సరైన కథ, సినిమా పడితే స్టార్ లెవల్ మెటీరియల్. అనసర్వ రాజన్ నటన బావుంది. అమ్మాయి అందంగా నటించింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ ఆశించిన స్థాయిలో లేదు. ఆయన కటౌట్ కొన్ని క్యారెక్టర్లకు సరిపోతుందని చెబుతుందీ సినిమా. అభినవ్ గోమఠం, సంతోష్ ప్రతాప్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. రచ్చ రవికి మంచి సీన్లు పడ్డాయి. 'వెన్నెల' కిశోర్, 'హైపర్' ఆది, కోవై సరళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, 'నిరీక్షణ' ఫేమ్, నేషనల్ అవార్డు విన్నర్ అర్చన... చెబుతూ వెళితే సినిమాలో సీజనల్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఒక్కరికీ సరైన క్యారెక్టర్ లేదు.

అటు ప్రేమ కథలో, ఇటు పోరాట స్ఫూర్తిలోనూ ఈ 'ఛాంపియన్' ఏ దశలోనూ ఛాంపియన్ అనిపించుకోలేదు. చరిత్రను మార్చకూడదు సార్. అయితే... రోషన్ మేక, అనస్వర రాజన్ జంట నటన బావుంది. వాళ్ళ కోసం వెళ్లాలని అనుకుంటే... ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లడం మంచిది.

Also ReadShambhala OTT: 'శంబాల' ఓటీటీ డీల్ క్లోజ్... ఆది సాయికుమార్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ డీటెయిల్స్

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల  వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report  :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి -  అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల  వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report  :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి -  అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget