అన్వేషించండి

Nani 30 Release Date : వెంకటేష్ vs నాని - బాక్సాఫీస్ బరిలో 'సైంధవ్'తో పోటీ 

నాని 30వ సినిమా విడుదల తేదీ నేడు వెల్లడించారు. బాక్సాఫీస్ బరిలో వెంకటేష్ 'సైంధవ్'తో ఈ సినిమా పోటీ పడనుంది.

ఇప్పుడు ఇండస్ట్రీలో సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టం అవుతోంది. అందులోనూ ఫెస్టివల్ సీజన్స్ అయితే సోలో రిలీజ్ మీద ఆశలు వదిలేసుకోవచ్చు. మినిమమ్ రెండు మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ బరిలో పాన్ ఇండియా సినిమాలతో ఇద్దరు తెలుగు హీరోలు పోటీ పడనున్నారు. 

డిసెంబర్ 21న నాని 30వ సినిమా!
నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా, 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్  (Mrunal Thakur) కథానాయికగా ఓ సినిమా రూపొందుతోంది. హీరోగా నాని 30వ చిత్రమిది. దీంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతునున్నారు. ఈ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు నేడు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 22 శుక్రవారం వచ్చింది. వీకెండ్ ఎలాగో ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. డిసెంబర్ 25, సోమవారం క్రిస్మస్ హాలిడే. ఆ రోజు కూడా థియేటర్ల దగ్గర సందడి ఉంది. నాని సినిమా గురువారం విడుదల కానుంది కనుక లాంగ్ వీకెండ్ (ఐదు రోజులు) మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే... నానికి ఇదేమీ సోలో రిలీజ్ కాదు. పోటీలో 'సైంధవ్' సినిమా కూడా ఉంది. 

డిసెంబర్ 22న వెంకీ మామ 'సైంధవ్'
'దసరా' సినిమా విజయంతో నాని మంచి హుషారులో ఉన్నారు. పైగా, ఇప్పుడు చేస్తున్న సినిమా ఆయన జానర్ క్లాస్ ఫిల్మ్. అందువల్ల, హైప్ ఉంటుంది. అటు వెంకటేష్ 'సైంధవ్'కు కూడా మంచి బజ్ ఉంది. ఆ సినిమా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. అదీ పాన్‌ ఇండియా చిత్రమే. యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, 'హిట్' విజయాల తర్వాత యువ దర్శకుడు శైలేష్ కొలను తీస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నానిది క్లాస్ సినిమా, వెంకీ మామది మాస్ సినిమా కావడంతో ఏ సినిమాకు వచ్చే ప్రేక్షకులకు ఆ సినిమాకు వస్తారు.

Also Read : పవర్‌ఫుల్ అప్డేట్ - 'ఓజీ' కోసం ముంబైకు పవన్ కళ్యాణ్, ఎప్పుడంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

విచిత్రం ఏమిటంటే... 'హిట్' సినిమాను నాని ప్రొడ్యూస్ చేశారు. శైలేష్ కొలను 'హిట్ 3'లో ఆయనే హీరో. ఇప్పుడు తన దర్శకుడి సినిమాతో నాని పోటీ పడబోతున్నారు. నానికి జోడీగా 'జెర్సీ'లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారుగా! ఆమె వెంకటేష్ 'సైంధవ్'లో నటిస్తున్నారు. ఇంతకు ముందు ఓ సినిమాతో వచ్చిన హీరో హీరోయిన్లు, ఇప్పుడు వేర్వేరు సినిమాలతో రానున్నారు. 

డాటర్ సెంటిమెంట్‌తో నాని సినిమా!
గోవాలో నాని సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రకటించినప్పుడు విడుదల చేసిన వీడియో చూస్తే... డాటర్ సెంటిమెంట్ కథలో కీలక అంశం కానుందని అర్థం అవుతోంది. విడుదల తేదీ వెల్లడిస్తూ ఓ స్టిల్ రిలీజ్ చేశారు. అందులోనూ ఓ చిన్నారి ఉంది. 

నాని 30 చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. 'జెర్సీ', 'శ్యామ్‌ సింగ రాయ్' చిత్రాలకూ ఆయన పని చేశారు. ఆ రెండు సినిమాల్లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుందని పేరు వచ్చింది. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Also Read ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget